ఆరోగ్య శ్రీ (Arogyashri)సేవలకు బ్రేక్ పడనుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆరోగ్య శ్రీ సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించారు.
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రచ్చకెక్కుతుంది. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు రోడ్ షోను అడ్డుకొనేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి నిరసన తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్ మండుటెండలో కూడా పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. పాదయాత్రలో లోకేశ్ పరిపూర్ణమైన నాయకుడిగా రూపుదిద్దుకుంటున్నారని కొనియాడారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకు(bank)లో డిపాజిట్(Deposit) చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.
తేనే కోసం వెళ్తే రాజధాని నిర్మాణ సామగ్రి కాలి బూడిదైంది. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
దేశంలో ప్రధాని మోదీపై (Narendra Modi), ఏపీలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పాలనను విమర్శిస్తూ సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె. నారాయణ (K Narayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతున్నాయని విమర్శించారు. దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన కొనసాగుతోందని ఆరోపించారు. గాంధీని చంపిన గాండ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ అంటూ తీవ్ర వ్యాఖ్య...
సుప్రీంకోర్టులో సునీత, అవినాష్ ఇద్దరికీ ఊరట కలిగింది. అవినాష్ ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది. అవినాష్‌ను ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.
వైఎస్ జగన్అ ధికారంలోకి వచ్చాక తిరుమలలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం టికెట్ల కేటాయింపులో అక్రమాలు , తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలు వంటివి జరగడం వాటికి నిదర్శనంగా చెబుతున్నారు.