»Fire Accident In Amaravati Capital Region Construction Material Burnt
మంటల్లో ఏపీ రాజధాని Amaravati.. భారీ అగ్ని ప్రమాదం
తేనే కోసం వెళ్తే రాజధాని నిర్మాణ సామగ్రి కాలి బూడిదైంది. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో (Amaravati) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. తేనే (Honey) కోసం వచ్చిన వ్యక్తులు నిప్పు పెట్టడంతో రాజధాని నిర్మాణ సామగ్రికి మంటలు అంటుకున్నాయి. భారీ విలువైన సామగ్రి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనతో ప్రజలు, స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
ఏపీలోని గుంటూరు జిల్లా (Guntur District) తుళ్లూరు (Tullur) మండలం నెక్కల్లు (Nekkallu) రాజధాని ప్రాంతంలో కీలకమైనది. నెక్కల్లు శివారులో రాజధాని నిర్మాణం కోసం తీసుకవచ్చిన సామగ్రి (Construction Material) నిల్వ ఉంచారు. భారీ ఎత్తున ప్లాస్టిక్ పైపులు, మురుగు నీటి కాలువల కోసం తీసుకొచ్చిన పైపులు అక్కడ డంప్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. నాలుగేళ్లుగా ఆ పైపులు అలాగే పడి ఉండడంతో పైపులకు తేనెతుట్టలు పెరిగాయి.
ఆ తేనేను తీసుకునేందుకు స్థానికులు శుక్రవారం అక్కడకు వచ్చారు. తేనే తీసేందుకు పొగ వేసేందుకు నిప్పు పెట్టారు. అయితే ఆ నిప్పు కాస్త పైపులకు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఎండ వేడిమికి తోడు ఈ మంటలతో పైపులు ఒకదానికొకటి అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి అక్కడ పరిస్థితి భయాందోళనకరంగా మారింది. భారీగా నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విలువైన సామగ్రి కాలి బూడిదైందని స్థానికులు, రాజధాని ప్రాంత రైతులు విమర్శిస్తున్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.