విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలముకోవడంతో ప్రయాణికులు రైలు నుంచి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసినప్పటికీ మరోసారి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణకు రానుంది. ఈ మేరకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై రేపు విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ నుంచి ముందుస్తు పర్మిషన్ తీసుకోకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని నాయుడు తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. మరి నేటి విచారణకు బాబు ఊరట లభిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొద్ది సేపు ఆగాల్సిందే.
అక్టోబర్ 1వ తేది నుంచి జనసేన వారాహి విజయయాత్ర నాలుగో విడత ప్రారంభం కానుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ఆ యాత్ర పునఃప్రారంభమవుతుందని, జనసేన సైనికులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
చంద్రబాబుకు మరో 11 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అక్టోబర్ 5వ తేది వరకూ ఆయన రాజమండ్రి జైలులోనే ఉండనున్నారు. సోమవారం బెయిల్‌పై విచారణ ఉంటుందని జడ్జి తెలిపింది.
మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.