ఏపీ(Ap), తెలంగాణ(Telangana)లో ఒక్కసారిగా వాతావరణం(Weather) మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భారీ ఎండలు అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాయంత్రం అయ్యేసరికి చల్లగా వాతావరణం మారిపోయింది. తిరుమల(Tirumala)లో వర్షాలు దంచికొట్టాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం(Rain) కురిసింది. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Rain) కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ(Weather) వెల్లడించింది.
తెలంగాణ(Telangana)లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు(Rain) పడ్డాయి. హైదరాబాద్ సహా సంగారెడ్డి, రంగారెడ్డి, చేవెళ్ల, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలో చెదురుముదురు గాలులతో వర్షాలు పడ్డాయి. మరో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల(Rain) నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎక్కడైనా చెట్లు, కరెంట్ పోల్స్ విరిగిపడడం లాంటివి జరిగితే 040-29555500కి ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కోరింది. ఏప్రిల్ 26 వరకూ చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.