ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పవన్ అంటున్నారు.
ఏపీ సీఎం జగన్.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సమావేశం అయ్యారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలిసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. సునీతకు, వివేకా రెండో భార్యకు మధ్య వివాదాలున్నాయని గుర్తు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మార్పులు తిరుగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఆయన తనయుడు, ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టవుతారనే వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ భయంతో బెయిల్ పిటిషన్ వేశారు.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.