ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ఘటనల నేపథ్యంలో యాత్ర2 మూవీ(Yatra2 Movie) సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఏపీ మంత్రి రోజా కాలినొప్పి, వాపు సమస్యలతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఇసుక దందాకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. యువగళం పాదయాత్ర చేస్తున్న క్రమంలో లోకేష్ అక్రమ ఇసుక ఉన్న చోట సెల్ఫీ చిత్రం దిగి నిరసన వ్యక్తం చేశారు.
వచ్చే నెలలో టీడీపీలో చేరతానని ప్రకటించిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతల సమావేశం నిన్న హైదరాబాద్లో చంద్రబాబును కలిసిన ఆనం రాం నారాయణ రెడ్డి చంద్రబాబుతో ఆనం గంటపాటు చర్చలు పార్టీలో చేరేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని పేర్కొన్న ఆనం
గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) సహా 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలను రెండు నెలల్లో అమలు చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో భాగంగా సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.
దేశంలో జనాభా లెక్కించే విధానం ఇకపై పూర్తిగా డిజిటల్(digital) రూపంలోకి మారేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది. అయితే ఈసారి డిజిటల్ విధానంలో 2024 మేలో వివరాల కోసం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి ఏపీ సీఎంవో స్పందించింది. డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం అందిస్తామని సీఎంవో అధికారి తెలిపారు.