మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గమైన పలాసలో అక్రమాలు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నించిన వారిని అణచివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka murder case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో 23 ఏళ్ల విద్యార్థిని ఊరివేసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.
విశాఖపట్నం శివార్లలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలుడు సంభవించింది, ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ. అదే సమయంలో మంటలను అదుపు చేసేందుకు 8 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు.