»Digital Approach This Time For Census India Two Mobile Apps Use
Digital approach: జనాభా లెక్కల కోసం ఈసారి డిజిటల్ విధానం
దేశంలో జనాభా లెక్కించే విధానం ఇకపై పూర్తిగా డిజిటల్(digital) రూపంలోకి మారేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది. అయితే ఈసారి డిజిటల్ విధానంలో 2024 మేలో వివరాల కోసం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దేశంలో జనాభా(Census) లెక్కల సేకరణ స్వరూపం ఈసారి పూర్తిగా మారనుంది. 140 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా పేపర్ వాడకుండా డిజిటల్ విధానం(Digital approach)లో వివరాలను సేకరించబోతున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం రెండు మొబైల్ యాప్ లను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో ఒకటి జనగణకుల కోసం(ఎన్యుమరేటర్లు) కాగా, మరొకటి పౌరుల కోసం సిద్ధం చేశారు. అయితే గతంలో జనాభా వివరాలు సేకరించాలంటే ఒక వ్యక్తి నుంచి 30 చొప్పున ప్రశ్నలు అడిగే వారు. కానీ ఇప్పుడు అదే ప్రశ్నలతో యాప్ ను రూపొందించారు. జనగణకులు తమ యాప్ లో ఆయా అభ్యర్థుల వివరాలను ఎంట్రీ చేస్తారు.
ఒకవేళ ప్రజలు ఎవరైనా ఆసక్తి ఉంటే నేరుగా యాప్ ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ప్రజలు నమోదు చేసుకున్న వివరాలను జనగణకులు ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. అయితే ఆ యాప్(apps) లు ఏంటి అనే వివరాలను మాత్రం ఇంకా కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఓసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. చివరిసారిగా 2011లో జరిగింది. 2021లో కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక వచ్చే డిసెంబర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2024 మేలోపు జనగణన మొదలయ్యే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
1881 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న జనాభా(Census) గణన చక్రానికి 2021లో భంగం కలిగింది. కరోనా కారణంగా సెన్సెస్ కౌంట్ జరగలేదు. అయితే 2021కి షెడ్యూల్ చేయబడిన జనాభా గణన 2024లో పూర్తిచేయాలని భావిస్తున్నారు. దాదాపు రూ.9,000 కోట్ల అంచనా వ్యయంతో దేశంలో మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ కోసం డేటాను క్రోడీకరించడానికి 3.3 మిలియన్లకు పైగా ఎన్యుమరేటర్లను ఇప్పటికే నియమించారు. ఈ జనాభా గణనకు సంబంధించిన మొత్తం డేటా సెన్సస్ మేనేజ్మెంట్, మానిటరింగ్ పోర్టల్‌కు కేంద్రంగా అందించబడుతుంది. బహుళ భాషల్లో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మద్దతు ఇచ్చే నిబంధన ఉంటుంది. ఈసారి ఎన్యుమరేషన్ ఫారంలో ట్రాన్స్జెండర్లను కూడా ప్రత్యేక కేటగిరీలో నమోదు చేయనున్నారు. 2011 వరకు స్త్రీ, పురుష లింగాలను మాత్రమే గుర్తించేవారు.
అసలు సెన్సస్ అంటే ఏమిటి?
సమాచార నిధి అని పిలవబడే జనాభా గణన. దేశంలో అక్షరాస్యత స్థాయిలు, విద్య, గృహాలు, గృహ సౌకర్యాలు, వలసలు, పట్టణీకరణ, సంతానోత్పత్తి, మరణాలు, భాష, మతం, వైకల్యం వంటి ఇతర సామాజిక-సాంస్కృతిక, జనాభా డేటాను ప్రజల(people) నుంచి సేకరిస్తారు. ఇది లింగం, వైవాహిక స్థితి సహా దేశంలోని ప్రజల ప్రాథమిక డేటాను గ్రామం, పట్టణం, వార్డు స్థాయిలలో సూచిస్తుంది.