• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కంచికచర్లలో డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీ

NTR: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా నుంచి విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్‌పై అవగాహన సైకిల్ ర్యాలీ యాత్ర పోలీస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలీస్ కమిషనర్ ఎస్ వి. రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలు, డ్రగ్సకి దూరంగా ఉండాలన్నారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

February 26, 2026 / 06:44 PM IST

బాల్యవివాహాలను అరికట్టాలి: ఎంపీ

ELR: బాల్య వివాహాలను అరికట్టాలని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. గురువారం బాల్య వివాహ విముక్తి రథాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అన్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారికి వివాహం చేయడం సమంజసం కాదని అన్నారు. మనమందరం కలిసికట్టుగా బాల్య వివాహ మూలాలను నిర్మూలించాలని చెప్పుకొచ్చారు.

February 26, 2026 / 06:44 PM IST

ఆచంటలో పిచ్చికుక్క దాడి

W.G. ఆచంటలో గురువారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. కచేరి సెంటర్, ఎం‌వీఆర్ కళాశాల రహదారి, ముత్యాలమ్మ గుడి ప్రాంతాల్లో ఐదుగురు విద్యార్థులతో సహా సుమారు 15 మందిపై దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారంతా PHCలో చికిత్స పొందుతున్నారు. వీధుల్లో కుక్కల బెడద పెరిగిపోవడంతో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 06:42 PM IST

అభివృద్ధి పనుల ఆలస్యంపై ఫయాజ్ అహ్మద్ ఆవేదన

KRNL: ఆదోనిలో కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఇవాళ మైనార్టీ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ ప్రాంతాల అభివృద్ధి పనుల ఆలస్యాన్ని ప్రస్తావించారు. రూ.21.60 లక్షల పనులు భూమిపూజ చేసినప్పటికీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

February 26, 2026 / 06:41 PM IST

నియోజకవర్గ సమస్యలపై సీఎంతో మాట్లాడిన ఎమ్మెల్యే

PLD: అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సీఎం చంద్రబాబుతో ముచ్చటించారు. నియోజకవర్గ సమస్యలపై సీఎం చంద్రబాబుకు వివరించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వంద రోజులు 100 గ్రామాలు కార్యక్రమం గురించి తెలిపారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన మేర పరిష్కరిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని భాష్యం కోరారు.

February 26, 2026 / 06:40 PM IST

ఐటీఐ కళాశాలను సందర్శించిన కలెక్టర్

CTR: త్వరలో ఐటీఐ కళాశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం విజయ పురంమండలంలో ప్రధాన కేంద్రంలో ఉన్న ఐటీఐ కళాశాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఐటీఐలో ఎలక్ట్రికల్, పిట్టర్, ఆటోమొబైల్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ వివిధ సెక్షన్‌లను పరిశీలించారు.

February 26, 2026 / 06:40 PM IST

నీట్ పరీక్షకు ఆరు కేంద్రాలు గుర్తింపు

VZM: మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌తో వీసీలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, అయ్యప్పనగర్‌లోని ఏపీ మోడల్ స్కూల్, JNTU బ్లాక్ 1, 2 , ప్రభుత్వ బాలికల హై స్కూల్‌లలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

February 26, 2026 / 06:35 PM IST

గుంటూరులో 47 ఆక్రమణలను తొలగించిన అధికారులు

గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. గురువారం అమరావతి, జీటీ రోడ్లలోని 47 ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

February 26, 2026 / 06:27 PM IST

సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీల దాడి దారుణం: కోన

E.G: ఏపీ శాసన మండలిలో శాసనమండలి BJP ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు చేయడం సిగ్గుచేటని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయ గురువారం పేర్కొన్నారు. సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. సభలో మహిళా మంత్రులు అని కూడా చూడకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 26, 2026 / 06:26 PM IST

ఇసుక తవ్వకాలను అడ్డుకున్న తహసీల్దార్

AKP: మాకవరపాలెం మండలం తూటిపాలలో ఇసుక తవ్వకాలను తహసీల్దార్ వెంకటరమణ గురువారం అడ్డుకున్నారు. ఈ గ్రామ శివారున ఉన్న సర్పానది నుంచి ఇసుక తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకొని ఇసుక తవ్వుతున్న ఒక జేసీబీని స్వాదీనం చేసుకున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 26, 2026 / 06:26 PM IST

వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న వేగుళ్ళ

E.G: ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగాంచిన కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల జనసేన సమన్వయకర్త వేగుళ్ళ లీలాకృష్ణ గురువారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 26, 2026 / 06:24 PM IST

జగన్‌ను కుటుంబం సమేతంగా కలిసిన శశికళ కృష్ణమోహన్

KRNL: వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కురువ శశికళ కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా ఇవాళ మాజీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 2029 ఎన్నికల్లో వైసీపీకు విజయం సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు.

February 26, 2026 / 06:23 PM IST

28నే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: కలెక్టర్

ATP: మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే, ఫిబ్రవరి 28న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి నగదు అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో 2,77,073 మందికి రూ.123.99 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

February 26, 2026 / 06:20 PM IST

జిల్లా కలెక్టర్ నాగరాణి తీవ్ర ఆగ్రహం

W.G. ఉండి, పాలకోడేరు ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూ.ఎఫ్.ఎస్ సర్వే, ఈ-కేవైసీ, పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. సర్వే ప్రక్రియ మందకొడిగా సాగడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

February 26, 2026 / 06:16 PM IST

CETP ప్లాంట్ ను పరిశీలించిన దినేష్ రెడ్డి

నెల్లూరు: ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ప్రాంతంలో ఉన్న కొండపల్లి ఎన్విరొ టెక్ CETP ప్లాంట్‌ను రాష్ట్ర ఎన్విరాల్‌మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరిశీలించారు. ప్లాంట్లో జరుగుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల నుండి వస్తున్న వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియ నిర్వహణ విధానంపై ఆరా తీశారు.

February 26, 2026 / 06:15 PM IST