ప్రకాశం: కంభం పట్టణంలోని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో పలు స్మశాన వాటికలకు నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ముస్లిం యూత్ సభ్యులు తెలిపారు.
కోనసీమ: ఏపీ శాసన మండలిలో గురువారం బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని కొత్తపేటకు చెందిన బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం దుయ్యబట్టారు. సీనియర్ సభ్యుడిపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. ప్రజలు వైసీపీ పార్టీకి చరమగీతం పాడిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు.
ATP: గుంతకల్లు మున్సిపల్ నాన్ పీహెచ్ వర్కర్స్‌తో మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ గురువారం సమావేశం నిర్వహించారు వేసవి కాల దృశ్య సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోని ఫిల్టర్ బ్లేడ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. పట్టణంలో పైప్లైన్ లీకేజీలు, పైప్ లైన్ లలో మురుగునీరు చేరి కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
VZM: వాల్టా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పర్యావరణ వేత్త, న్యాయవాది బి. రామకృష్ణ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎస్.కోటలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సమీపంలో అనుమతులు లేకుండా కొంతమంది జెసిబితో భారీ వృక్షాలు తొలగించారని మండిపడ్డారు. అనుమతులు లేకుండా వృక్షాలు తొలగింపు విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.
ATP: స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ పీ4 కార్యక్రమాలపై ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లాలో కీలక అభివృద్ధి సూచికల్లో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
KDP: మైదుకూరులోని బద్వేల్ రోడ్డుపై నూతన HPCL పెట్రోల్ బంకును ఎమ్మెల్యే సుధాకర్ ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రవీంద్ర, 7వ వార్డు కౌన్సిలర్ సుమలత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ వెంకటయ్య ఫిల్లింగ్ స్టేషన్‌ను రిబ్బన్ కట్ చేసి, టెంకాయ కొట్టి ప్రారంభించారు. నూతన వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
AKP: విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బంది సూచించారు. గురువారం కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలన్నారు. బజార్లో దొరికే జింక్ ఫుడ్స్ జోలికి వెళ్ళవద్దన్నారు. ఆకుకూరలు కాయగూరలు తీసుకోవాలన్నారు.
KRNL: దేవనకొండ(మం) కప్పట్రాళ్ల స్టేజి సమీపంలో ఇవాళ రెండు కార్లు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సీఐ వేణుగోపాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASR: రంపచోడవరం మండలం తామరపల్లి సచివాలయంలో రీ-సర్వే అవగాహన సమావేశం నిర్వహించారు. సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి, ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం మాట్లాడుతూ.. గ్రామంలో త్వరలో రీ సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తమ భూముల సరిహద్దులు శుభ్రంగా ఉంచి, అవసరమైన పత్రాల జిరాక్స్ ప్రతులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ATP: రాప్తాడు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి గురువారం ఎమ్మెల్యే పరిటాల సునీత వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రిని ప్రత్యేకంగా కలిసి ఆలయాల పరిస్థితి గురించి చర్చించి, నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.
E.G: ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత గురువారం తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ తదితర కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 15,972 హాజరయ్యారని చెప్పారు. 385 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారని వివరించారు. జనరల్ విద్యార్థులు 14,128, ఒకేషనల్ విద్యార్థులు 1,844 మంది పరీక్ష రాశారని వెల్లడించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్. విశ్వరత్నంకు ఉద్యోగోన్నతిపై సూపరింటెండెంట్‌గా బాధ్యతలను కేటాయిస్తూ కమిషనర్ నందన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో కమిషనర్ నుంచి విశ్వరత్నం గురువారం ఉత్తర్వులు అందుకున్నారు. విధులలో ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు.
ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ.. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, రూ. 37,500 వరకు వేతనం పొందే జాబ్స్ ఉన్నట్లు ఆమె తెలిపారు.
W.G: కూటమి ప్రభుత్వం దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆచంట నియోజకవర్గ మాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా గురువారం ఆచంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను వీడాలని నినాదాలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ సోమేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు.