కృష్ణా: గన్నవరంలో సీపీఎం నేత మల్లంపల్లి ఆంజనేయులు ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులను ఖండించారు. అంతర్జాతీయ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వల్ల సామాన్య ప్రజలే నష్టపోతారని అన్నారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం: మర్రిపూడిలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన సలీం రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ పోలీసు ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయడం ఆనందకరమని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విసన్నపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కొలికపోగు మహేష్ (40) అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. మహేష్ మరణంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచరులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ ఫిర్యాదులను నేరుగా వన్ టౌన్ స్టేషన్‌కు రావాలన్నారు.
విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలన్నారు.
NLR: జిల్లాలో మహిళల భద్రతే లక్ష్యంగా నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శక్తి యాప్‌పై పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో శక్తి బృందాలు పర్యటిస్తూ మహిళలు, విద్యార్థినులు ఈ యాప్ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆపద సమయంలో యాప్ ద్వారా పోలీసుల తక్షణ సహాయం పొందవచ్చన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు ప్రత్యక్షంగా హాజరై లేదా https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.
కృష్ణా: అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని MLA యార్లగడ్డ వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు, టాయిలెట్లు, టీవీ, ఆర్వో సౌకర్యాలు కల్పించడంతో పాటు 58,204 మంది వర్కర్లకు 5జీ స్మార్ట్‌ఫోన్లు అందించామని తెలిపారు. మినీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పిస్తామన్నారు.
CTR: కాణిపాకం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్‌లో 18.60 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలు, ధ్యాన మందిరం ఏర్పాటు తదితర వాటికి దీనిని ఉపయోగించనున్నట్టు సమాచారం.
ATP: కళ్యాణదుర్గం పరిధిలోని గువనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముదిగలకు చెందిన సోదరీసోదరులు చంద్రకళ (32), శివకుమార్ (36), హనుమంత రాయుడు (40)గా గుర్తించారు. కర్ణాటకలోని మొలకల్మూరులో వివాహానికి వెళ్లి వస్తుండగా, అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్తున్న బస్సు వీరి కారును ఢీకొంది.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం రెవెన్యూ క్లినిక్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం, కదిరి, మడకశిర డివిజన్ల అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భూమి సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదార్ పేరు మార్పులు తదితర ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఫిర్యాదులు సమర్పించాలని కోరారు.
KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
KDP: వల్లూరు మండలం పుష్పగిరి నదిలో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు డ్యాం చూడటానికి వచ్చి సరదాగా నదిలో దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నదిలో కొట్టుకుపోయారు. సురేంద్ర (25) అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు శ్రీనాథ్, చైతన్య గల్లంతయ్యారు. శ్రీనాథ్ రైల్వే కొండాపురానికి చెందిన వ్యక్తిగా సురేంద్ర తెలపాడు.
PLD: శ్రీ బాల చార్మిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పాల్గున శుద్ధ పూర్ణిమ కేతు గ్రహ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయము మూసివేయనున్నట్లు సహాయ కమిషనర్ రేఖ తెలిపారు. పునః ప్రారంభం నాలుగవ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ అనంతరం గుడి తెరవబడుతుందని ఆమె అన్నారు. భక్తులు గమనించగలరని తెలిపారు.