• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెండింగ్ క్లెయిములను పరిష్కరించాలని వినతి

W.G: భీమవరంలో భవన, ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమం ఎఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పెండింగులో ఉన్న 46 వేల క్లెయిములను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కార్మికశాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్‌కు యూనియన్ తరఫున వినతిపత్రం అందజేశారు.

February 22, 2026 / 06:34 AM IST

జిల్లాలో 64 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు: RIO

ATP: జిల్లాలో ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆర్ఐవో వెంకట రమణనాయక్ తెలిపారు. మొత్తం 64 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఉదయం 8.15 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 24,568 మంది, ద్వితీయ సంవత్సరంలో 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

February 22, 2026 / 06:32 AM IST

ఆరు కిలోల గంజాయి పట్టివేత

SKLM: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ద్విచక్రవాహనం పై 6 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న గంజాయిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయి రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు ఉంటాయని సీఐ అన్నారు

February 22, 2026 / 06:30 AM IST

ఉత్తమ ఫలితాలు సాధించాలి.. ఏటీడబ్ల్యూవో

 ASR: జీ.మాడుగుల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శనివారం ఫేర్ వెల్ పార్టీ నిర్వహించారు. ఇందులో బాగంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జీ.మాడుగుల ఏటీడబ్ల్యూవో నాగ శిరీష విద్యార్థులకు సూచించారు. సమయం వృథా చేయకుండా అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

February 22, 2026 / 06:30 AM IST

తొర్రివేముల వాసికి వైసీపీలో పదవి

KDP: వైసీపీ రాష్ట్ర అనుబంధ వింగ్ కమిటీ సభ్యులను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఇందులో భాగంగా కడప జిల్లా బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మైలవరం మండలం తొర్రి వేముల సుబ్బయ్యను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన YS జగన్‌కు జిల్లా వైసీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 06:28 AM IST

నేడు ఉచిత వైద్య శిబిరం

CTR: శాంతిపురం మండల పరిధి పెద్దూరు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పీఈఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పీఆర్‌వోలు వెంకటేష్, చంద్ర తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 06:27 AM IST

నేడు జిల్లాలో మాంసపు ధరలు ఇలా..

కడప జిల్లాలో మాంసం ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ కిలో ధర రూ. 210 నుంచి రూ. 240 వరకు ఉండగా, మటన్ ధర కిలోకు రూ. 850గా కొనసాగుతోంది. చేపల ధరలు కిలోకు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. ధరలు పెరిగినా వినియోగదారుల రద్దీ మాత్రం తగ్గలేదు.

February 22, 2026 / 06:20 AM IST

నేడు నీతి అయోగ్ సీఈఓ జిల్లాకు రాక

VSP: “నీతి ఆయోగ్” ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) బివీఆర్ సుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం విశాఖపట్నం రానున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొని, 23న ఉదయం తిరుగు పయనమవుతారన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు గమనించాలని సూచించారు.

February 22, 2026 / 06:19 AM IST

వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నియామకం

PPM: వైసీపీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా సాలూరుకు చెందిన యువ న్యాయవాది గొర్లె కిరణ్‌ కుమార్‌ నియమితులయ్యారు.ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ సందర్భంగా పార్టీకి అన్నివిధాలా న్యాయ సలహాలు, సూచనలు అందిస్తానని కిరణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ నియామకంపై మాజీ Day CM పీడిక రాజన్న దొర హర్షం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 06:16 AM IST

LG పరిశ్రమలో చోరీ.. నలుగురు అరెస్ట్

TPT: శ్రీసిటీ పరిధిలోని LG పరిశ్రమ వద్ద కాపర్ వైర్ల దొంగతనానికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రోజూవారి కూలీ పనులకు వచ్చిన వీరు కాపర్ వైర్లను దొంగిలించినట్లు తెలిపారు. LG పరిశ్రమ HR ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీసిటీ పోలీసులు వీరిపై నిఘా ఉంచి పట్టుకున్నారు. రూ.2.30 లక్షల విలువైన రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 06:15 AM IST

అల్లూరి జిల్లా : మార్చి 14న జాతీయ లోక్ అదాలత్

ASR: అరకు ప్రధమ శ్రేణి జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి రాము తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీపడే అవకాశం ఉన్న కేసులు, లోక్ అదాలత్‌లో పరిష్కారం కోసం లాయర్లు, పోలీసు అధికారులు అవగాహన కల్పించాలన్నారు

February 22, 2026 / 06:13 AM IST

నేడు పరవాడలో పైడిమాంబ అమ్మవారి పండగ

AKP: మండల కేంద్రమైన పరవాడలో ఆదివారం పైడిమాంబ అమ్మవారి పండగను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే తానాం గ్రామంలో పరదేశిమాంబ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించనున్నారు. రెండు గ్రామాల్లోనూ మూడు రోజులు పాటు పండగలు జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 06:10 AM IST

అగర్బత్తులు తయారీ కేంద్రాన్ని పరిశీలించిన జీఈఈవో

TPT: దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణశాలలో పనిచేస్తున్న అగర్బత్తులు తయారీ కేంద్రాన్ని జీఈఈవో డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. ప్రస్తుతం చామంతి, గులాబీ, తామర సుగంధాలతో మూడు రకాల అగర్బత్తులు తయారవుతున్నాయని, త్వరలో సంపంగి, వెయ్యి వరహాలు, తులసి సుగంధాలతో మరో మూడు రకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 06:09 AM IST

కారు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

GNTR: గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని ఒక గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 06:09 AM IST

నేడు పట్టణంలో హ్యాపీ సండే కార్యక్రమం

VZM: పట్టణంలో స్దానిక కోట వద్ద ఆదివారం ఉదయం 6.30 నుండి 8.30 వరకు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మునిసిపల్ సహాయ కమీషనర్ కిల్లాన అప్పలరాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవితంతో సతమతమవుతున్న ప్రజానీకానికి మానసిక ఉల్లాసం కలిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.

February 22, 2026 / 06:05 AM IST