TPT: వెంకటగిరి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసి జ్యోతి ఆహ్వానించారు. ఈనెల 23వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనుండగా, మెరిట్ జాబితాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
KKDP: గండేపల్లి మండలంలో ఆకతాయిగా తిరుగుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న 11 మంది వ్యక్తులకు జగ్గంపేట CI శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని గండేపల్లి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌లో హాజరపరచి, సత్ప్రవర్తన కొరకు బైండోవర్ చేశామని సీఐ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా CI హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లెలో రుషికప్రియపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ శుక్రవారం మదనపల్లిలోని స్థానిక విజయనగర్ కాలనీలో ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని, వారికి సామాజిక మద్దతు అందించాల్సిన అవసరాన్ని నిరసనకారులు నొక్కి చెప్పారు.
KRNL: కేంద్ర భారీ పరిశ్రమలు, స్టీలు శాఖ మంత్రి హెచ్ ఢీ కుమారస్వామి రేపు మంత్రాలయం రానున్నారు. ఆయన రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 23వ తేదీన గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటునట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
కోనసీమ: ఆత్రేయపురం మండలం పూడింది గ్రామం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న పాసింజర్ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.
VZM: పెదబంటుపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ 10వ తరగతి విద్యార్థుల గృహాలకు వెళ్లి పరామర్శించారు. త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రస్తుత చదువు స్థాయిని పరిశీలించి, వారికి అవసరమైన సలహాలు, దిశానిర్దేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతోనూ చర్చించి, పిల్లలు నిరంతరంగా చదువుకునేలా అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ఏలూరు: నగరంలోని డివిజన్ 27, 28లలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శనివారం తంగెళ్ళమూడి-1 సచివాలయం వద్ద, FCI గోడౌన్స్ సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజల వద్ద ఉన్న ఈ- వేస్ట్ ను అందజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
గుంటూరు: మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. గుంటూరు జోన్-3 పరిధిలోని ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్ లింక్ ద్వారా వీటిని సరిచేయాలి. యూడైస్ కోడ్ ఆధారంగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్, మతం తదితర వివరాలను శనివారం సాయంత్రం 5 గంటల్లోపు సవరించాలని కోరారు.
ప్రకాశం జిల్లాలో శనగలు, మినుముల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని జాయింట్ కలెక్టర్ నిర్మల కుమారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శనగలకు క్వింటాలుకు రూ. 5875, మినుములకు రూ.7800 మద్దతు ధర నిర్ణయించిందని ఆమె వెల్లడించారు. రైతులు ఈనెల 21వ తేదీ నుంచి రైతుసేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని ఆమె సూచించారు.
BPT: బాపట్ల జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది మొత్తం 19,032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం నుంచి 9,744 మంది, రెండో సంవత్సరం నుండి 9,288 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు షర్మిల తెలిపారు. గ్రామంలోని నర్వేనంబర్ 38లోని సబ్-డివిజజన్ భూములకు రీ సర్వే ఉంటుందన్నారు. ఆ సర్వేనెంబర్‌లో భూములు గల రైతులు భూ సర్వేకు సహకరించాలని ఆమె కోరారు.
ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు షర్మిల తెలిపారు. గ్రామంలోని నర్వే నంబర్ 38లోని సబ్-డివిజజన్ భూములకు రీ సర్వే ఉంటుందన్నారు. ఆ సర్వేనెంబర్‌లో భూములు గల రైతులు భూ సర్వేకు సహకరించాలని ఆమె కోరారు.
CTR: జీడీనెల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల సమీక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు తహశీల్దార్ శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని జాతీయ, రాష్ట్ర పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. బుధవారం జరగాల్సిన సమావేశం కొన్ని అనివార్య కారణాలతో నేటికి వాయిదా పడింది.
KRNL: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనన.. మరణా లను 21 రోజుల్లో నమోదు చేసుకోవాలని DMHO డాక్టర్ భాస్కర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జనన, మరణాలను 21 రోజు ల్లోపు చేసుకొంటే సేవలు ఉచితంగా, 21 నుంచి 30 రోజుల్లో చేసుకొంటే రూ.25, నెల దాటితే రూ.250, ఏడాది అయితే రూ.500 రుసుముతో పాటు అఫిడవిట్ అధికారి అనుమతి అవసరమని ఆయన చెప్పారు.