• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Kuthuhalamma: మాజీ మంత్రి కుతుహలమ్మ కన్నుమూత

చిత్తూరు జిల్లాలో కీలక నాయకురాలిగా వ్యవహరించిన ఆమె ఉమ్మడి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. ఆమె మృతికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించారు. ఆమె ప్రజలకు విశేష సేవలు అందించారని స్మరించుకున్నారు.

February 15, 2023 / 10:31 AM IST

NTR image on RS 100 coin: పురంధేశ్వరిని కలిసిన అధికారులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు.

February 15, 2023 / 10:15 AM IST

Ambati Rambabuకి షాక్.. మంత్రి అయితే ఏంటి గొప్ప? నిలదీసిన యువకుడు

మంత్రి అయితే ఎవరికి గొప్ప. మా తమ్ముడు కారు నడిపి జీవనం సాగిస్తున్నాడు. వాడు కారు తిప్పితే మా అమ్మ పింఛన్ ఎలా తొలగిస్తారు’ అని వెంకటేశ్వర్లు మంత్రి అంబటిని నిలదీశాడు. ఈ క్రమంలో మంత్రికి, ఆ యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. మంత్రి నిలదీస్తావా అంటూ పోలీసులు అతడిని లాక్కెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు.

February 15, 2023 / 09:16 AM IST

Tongue Slip నోరుజారిన కిషన్ రెడ్డి.. రోజాను తెలంగాణ మంత్రి చేసిన వైనం

ఆర్కే రోజాను ప్రస్తావిస్తూ ‘ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రి రోజా చెప్పారు’ అంటూ ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ‘ఆంధ్రప్రదేశ్’ అని రెండు మూడుసార్లు చెప్పారు. ఈ పరిణామానికి వెంటనే తేరుకున్న కిషన్ రెడ్డి, రోజా ఇద్దరు గొల్లున నవ్వారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ విషయమై రోజాకు వివరణ ఇస్తుండగా.. ‘పర్లేదు. కానీయండి’ అంటూ రోజా అన్నారు. అనం...

February 15, 2023 / 10:29 AM IST

Buggana Rajendranath Reddy: 3 కాదు… విశాఖ మాత్రమే రాజధాని

ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

February 15, 2023 / 06:53 AM IST

kotamreddy vs anil:కోటంరెడ్డి, అనిల్ అనుచరుల గొడవ.. కత్తిపోట్లతో ఆస్పత్రిలో చేరిక

kotamreddy vs anil:నెల్లూరు (nellore) బారషహీద్ దర్గా వద్దకు భక్తులు వస్తుంటారు. ఈ రోజు కూడా రద్దీగా ఉంది. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. కత్తిపోట్లు పొడుచుకోగా.. పోలీసులను మొహరించారు. దర్గా వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

February 14, 2023 / 09:28 PM IST

Anitha: పుంజు ఐతే అమర్నాథ్ తెలియదని చెబుతాడన్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు.

February 15, 2023 / 05:10 AM IST

nara lokesh:రూ.20 లక్షలు ఇస్తా.. బాలిక ప్రాణాలు తీసుకొస్తావా జగన్: నారా లోకేశ్

nara lokesh:ఏపీ సీఎం జగన్‌పై (jagan) టీడీపీ యువనేత నారా లోకేశ్ (nara lokesh) ఫైరయ్యారు. తాడేపల్లిలో (tadepalli) చూపులేని బాలిక (minor girl) హత్య గురించి ప్రస్తావించారు. చిన్నారి ప్రాణాలకు రూ.10 లక్షలు (10 lakhs) ఇచ్చి వెల కట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తను రూ.20 లక్షలు (20 lakhs) ఇస్తా.. బాలికను తిరిగి తీసుకొస్తారా అని నారా లోకేశ్ (lokesh) నిలదీశారు.

February 14, 2023 / 08:51 PM IST

RK Roja:లోకేశ్ అంకుల్.. ఐరన్ లెగ్: మంత్రి రోజా

RK Roja: నారా లోకేశ్‌పై (nara lokesh) మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఫైరయ్యారు. నిన్న నగరి (nagari) యువగళం పాదయాత్రలో రోజాను.. జబర్ధస్త్ ఆంటీ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఈ రోజు రోజా కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ఐరన్ లెగ్ (iron leg) అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువు అయ్యిందని పేర్కొన్నారు. లోకేశ్‌కు (lokesh) పెద్దలను గౌరవించడం తెలియదని మండిపడ్డారు.

February 14, 2023 / 07:52 PM IST

Tourism : అమరావతిలో బుద్దధ్యానవనం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఏపీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి (Kishan reddy) కిషన్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి (Amaravathi) అమరావతిలో బుద్దధ్యానవనం(Buddhyanavanam)ప్రారంభించారు. రూ.7 వేల కోట్లతో 'స్వదేశీ దర్శన్' పేరుతో దేశవ్యాప్తంగా టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు.

February 14, 2023 / 05:03 PM IST

vangalapudi anitha: జగన్ నీకు సిగ్గనిపించడం లేదా? రిజైన్ చేస్తే దరిద్రం పోతుంది

ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి వనిత తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 14, 2023 / 01:23 PM IST

Kodali Nani: షాకింగ్… జగన్ పతనం కోరుకున్న వైయస్ వివేకా

వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు.

February 14, 2023 / 09:51 AM IST

Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరు మార్చేశారు

విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం... తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. ఇప్పుడు ఆ కళాక్షేత్రం పేరు కూడా మారింది! ఈ పేరులోను తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది.

February 14, 2023 / 07:30 AM IST

YS Jagan: ఇక వైసీపీ సెల్‌ఫోన్ స్టిక్కర్ ప్రచారం

ప్రజల సెల్‌ఫోన్‌లకు కూడా స్టిక్కర్లు అంటించాలని సిద్ధమవుతోంది వైసీపీ ప్రభుత్వం. మార్చి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు 5.65 లక్షలమంది వైసీపీ సమన్వయకర్తలు, గృహసారథులు ఇందులో పాల్గొంటారు.

February 14, 2023 / 07:08 AM IST

30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు: సీఎం జగన్

30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల (30 mlas) పనితీరు వెనకబడిందని ఏపీ సీఎం జగన్ (cm jagan) అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరు సర్వేను సమావేశంలో ఆయన ప్రదర్శించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలకు స్పష్టం చేశారు.

February 13, 2023 / 09:34 PM IST