ATP: నార్పల మండల కేంద్రంలోని గూగూడు కుల్లాయి స్వామి ఆలయంలో భక్తాదులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం లెక్కించునున్నట్లు ఆలయ ఈవో శోభ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకులను ఆలయ ఆవరణలో లెక్కింపు జరుగుతుందన్నారు
GNTR: తెనాలి మెప్మా విభాగం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మంగళవారం ఉదయం 11 గంటలకు కళ్యాణ మేళాను నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. మేళాలో ప్రధానమంత్రి స్వానిధి 2.0 పథకం కింద వీధి వ్యాపారుల కొత్త రుణాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, పెండింగ్‌లో ఉన్న వాటిని ప్రాసెస్ చేయిచడం జరుగుతుందన్నారు.
ASR: హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈనెల 27న అరకులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్-51ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈమేరకు జరిగే ర్యాలీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
NLR: అసెంబ్లీలో సోమవారం ఉదయగిరి సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2018లో మంత్రి నారా లోకేష్ బాబు క్లోరిన్ బారి నుంచి ప్రజలను రక్షించడానికి, ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ అందించాలనే సంకల్పంతో ‘సృజల స్రవంతి చేశారని వివరించారు.
సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు తప్పులేని ఓటరు జాబితా, యువత ఓటు నమోదు, పోలింగ్ శాతం పెంపు కోసం సహకరించాలని కోరారు. 23 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో BLOలు ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్ల వివరాలు సేకరించనున్నారు.
ELR: జీలుగుమిల్లిలో మంగళవారం జరగనున్న ఆయుధ కర్మాగార వ్యతిరేక కమిటీ ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, శాంతి భద్రతలకు అంతరాయం కలుగుతుందని హెచ్చరించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 యాక్ట్ అమల్లో ఉన్నాయని తెలిపారు. అనుమతి లేని నిరసనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వరరావు అన్నారు.
ప్రకాశం: జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో సోమవారం చిన్న కారణాలకే ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. గొల్లవిడిపి గ్రామంలో భార్య చికెన్ వండలేదని భర్త లక్ష్మీనారాయణ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాలుట్ల గ్రామంలో, బిందెతో తమ్ముడిని నీళ్లు తీసుకురావాలని సోదరి చెప్పగా, అందుకు తమ్ముడు నిరాకరించడంతో సోదరి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
గుంటూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పెదకూరపాడుఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఎత్తిన దానిని పరిష్కారించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపొందెల కృషి చేయాలని నాయకులను ఎమ్మెల్యే ప్రవీణ్ కోరారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు.
W.G: భీమవరం డివిజన్‌కు సంబంధించిన ఇ – డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి పొరుగు సేవల పద్ధతిలో దరఖాస్తులు చేసుకోవచ్చునని కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ దరఖాస్తును అందుబాటులో ఉంచామన్నారు. వాటిని పూరించిన దరఖాస్తులను విద్యార్హత ధృవీకరించబడిన కాపీలతో భీమవరంలోని జిల్లా రెవెన్యూ అధికారి సీసీకి అక్టోబర్ 3లోగా అందజేయాలన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శివనగర్ కాలనీలో పర్యటించిన ఆయన మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. వర్షాలకు మురికినీరు రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు ఉన్నామని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
ATP: తగరకుంట-అనంతపురం డబుల్ రోడ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు రాబోయే రోజుల్లో రాకపోకల ఇబ్బందులు తీరనున్నాయని తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలోని గ్రామాల్లోనూ రోడ్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
KRNL: పత్తికొండలో టమోటో ప్రాసెసింగ్ యూనిట్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఏ. సిరి ఏపీఎంఐపీ పీడీని సోమవారం ఆదేశించారు. తడకనపల్లిలో తొలి జంతువుల వసతి గృహం ఏర్పాటు చేయనున్నామని, మిగతా జిల్లా వారు కూడా వచ్చి దీనిని చూస్తారన్నారు. 5 గ్రామీణ నియోజకవర్గాలలో కూడా జంతువుల వసతి గృహం ఏర్పాటు చేసేందుకు ఆయా నియోజకవర్గాలను గుర్తించాలని సూచించారు.
W.G: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇంఛార్జ్ అధికారిగా ఏవి సూరిబాబు ఇటీవల నియమితులయ్యారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణిను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. అన్ని వసతి గృహాలలో సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన రూక్కయ్య, లక్ష్మీ కుమారి నిద్రిస్తున్న సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వారిని బంధించి దాడి చేసి ఇంట్లో ఉన్న అభరణాలు, క్యాష్, బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా ఇవాళ ఉదయం ఘటన స్థలానికి డీఎస్పీ రవిచంద్ర చేరుకొని పరిశీలించారు.