GNTR: పెదనందిపాడు పీహెచ్‌సీ పరిధిలోని వరగాని గ్రామంలో మంగళవారం ‘స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్, పెద్దల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా కౌమార దశలోని బాలికలకు, గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్, క్షయ వ్యాధి స్క్రీనింగ్‌తో పాటు పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
KNRL: కోడుమూరు MLA దస్తగిరి, కేడిసీసీ బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్థన్ రెడ్డి ఆదేశాల మేరకు సీ. బెలగల్ మండలం కంపాడు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ జడ్పీటీసీ చంద్రశేఖర్ జల హారతి ఇచ్చారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోటర్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ కుంట చూసిన నీటితో జలకళను సంతరించుకుందన్నారు.
NLR: జిల్లాలో రెండో పంటగా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీలో కోరారు. 3 లక్షల ఎకరాల్లో 9 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు
కోనసీమ: అమలాపురం రూరల్ మండలం సమనస పంచాయతీ పరిధిలో మంగళవారం విలసవిల్లి చెయ్యేరు వెళ్లే పంట కాలువ వద్ద ఆటో బోల్తా పడింది. ఆటోలో తల్లి, నాలుగు నెలలు పసిపాప ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీయడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
TPT: వెంకటగిరి గ్రామశక్తి కలివెలమ్మతల్లికి ఎంతో చరిత్ర ఉంది. ప్రస్తుతం వెంకటగిరిగా పిలవబడుతున్న ఈ ఊరు గొబ్బూరు రాజుల కాలంలో కలిమిలిగా పిలిచేవారు. ఓ రైతు పొలం దుక్కి దున్నేటప్పుడు విగ్రహం బయటపడటంతో ఈ విషయం తెలుసుకున్న వెంకటగిరి రాజులు ఆ విగ్రహాన్ని కలివెలమ్మ తల్లిగా కొలిచారు. అప్పటి నుంచి ఈ గ్రామాన్ని కలిమిలిగా పిలిచేవారు.
E.G: అందరినీ కలుపుకుంటూ సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాజమండ్రి నగర నూతన కమిటీ సభ్యులకు సూచించారు. నూతన కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీ బుడ్డిగ రాధా తదితరులు మంగళవారం రాజమండ్రిలో ఆయనను కలిసారు. సమర్ధవంతమైన నాయకత్వానికి నగర కమిటీలో స్థానం దక్కిందన్నారు.
AKP: ఎస్కార్ట్ సమయంలో నిందితుడు పరారైన ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎఆర్, లా అండ్ ఆర్డర్ సిబ్బందికి కఠిన సూచనలు జారీ చేశారు. మంగళవారం అనకాపల్లి కార్యాలయంలో ఆయన మాట్లడారు. నిందితుల కేసులు, చరిత్రపై సిబ్బందికి ముందస్తు అవగాహన ఉండాలని, రిమాండ్ ఖైదీలు, కరడుగట్టిన నేరస్థులకు అదనపు భద్రత తప్పనిసరి అని తెలిపారు.
PPM: పాలకొండలో గల శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారిని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం తీర్థప్రసాదాలను కలెక్టర్‌కు అందజేశారు. ఆనంతరం ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ పాల్గొన్నారు.
TPT: శరన్నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణం పటేల్ వీధిలో మంగళవారం రెండో రోజు దుర్గాదేవి అమ్మవారు గాయత్రి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉప పీఠాధిపతి కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గాయత్రీ అమ్మవారి మంత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం శ్రీ విజయ దుర్గ అమ్మవారి హోమం, పల్లకి సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సత్యసాయి: ప్రతి ఇంటిలో మహిళలు బలంగా ఉంటే సమాజం ధృఢంగా ఉంటుందని తొగటవీర క్షత్రీయ సంఘం అద్యక్షులు సీసీ హరీదాస్ తెలిపారు. సోమందేపల్లి మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వస్థ్ నారీ- స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీసీ హరిదాస్ మాట్లాడుతూ.. సమాజంలో ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
బాపట్ల-చీరాల జాతీయ రహదారిపై వెదుళ్ళపల్లిలోని చెవిటి, మూగ పిల్లల పాఠశాల వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు ఆ పాఠశాల ఉద్యోగి అని తెలిసింది. గతంలో ఇక్కడ పలు ప్రమాదాలు జరిగాయి. బధిరులైన విద్యార్థులు రోడ్డు దాటేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
GNTR: తెనాలి డివిజన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మారీసుపేటలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, మున్సిపల్ కార్మికులతో కలిసి పాల్గొని సమస్యలపై నినాదాలు చేశారు. లేబర్ కోడ్ అమలు చేయవద్దని, రద్దయిన 29 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
PLD: సత్తెనపల్లిలోని వెంకటపతి కాలనీలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ ప్రత్యంగిరా అమ్మవారి పీఠంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు మంగళవారం ఆశ్వీయుజ శుద్ధ విదియనాడు గాయత్రీ దేవిగా శ్రీ నీలంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రులను పురస్కరించుకొని భక్తులు విరివిగా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ATP: గుత్తిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని బీసీ కాలనీలో నివాసముండే ఈశ్వరరావు అనే లారీ డ్రైవర్ అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VSP: ఆపరేషన్ లంగ్స్ కొనసాగుతోందని, ఇందులో ఎటువంటి మార్పు ఉండదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకే ఆపరేషన్ లంగ్స్‌కు శ్రీకారం చుట్టామన్నారు. అయితే చిరు వ్యాపారులకు హాకర్స్...