Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల తన వారాహీ వాహనాన్ని వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కొండగట్టుకు, అక్కడి నుండి ధర్మవరం, ఆ తరువాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవాలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించారు.
Pawan Kalyan : విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చనిపోయిన చిన్నారి విషయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆస్పత్రిలో చిన్నారి చనిపోతే... స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో... ఆ బిడ్డ తల్లిదండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు.. శవాన్ని బైక్ పై తీసుకువెళ్లారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. కాగా... ఈ ఘటనపై పవన్ స్పందించారు.
రిపాలన రాజధానిగా కాబోతున్న విశాఖపట్టణంలో ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. జనవరి 6న సచివాలయ కన్వీనర్ పై కూడా గంజాయి మత్తులో కొందరు దాడులు చేశారు. ఒక రోజు పోలీస్ రక్షక్ వాహనంపై కూడా దాడి చేశారని తెలుస్తున్నది. విశాఖపట్టణంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. బహిరంగంగానే వీటి విక్రయాలు సాగుతున్నాయి.
రాయలసీమ నీరు, వాటర్ ట్యాంకుకు సంబంధించి రోజా, నాగబాబుల మధ్య ఇటీవల ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ... మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు... నగరికి వైయస్సార్ పోలవరం అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు.
chandrababu:సీఎం జగన్‌పై (jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (chandrababu) ఫైరయ్యారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ రోజు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ (tdp) అని స్పష్టం చేశారు.
chintakayala vijay:టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ-టీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ (chintakayala vijay) సీఐడీ (cid) విచారణ ముగిసింది. ఏడు గంటల పాటు (7 hours) సుధీర్ఘంగా అధికారులు విచారించారు. రెండోసారి సీఐడీ విచారణకు వెళ్లానని విజయ్ మీడియాకు తెలిపారు. మొన్న 68 ప్రశ్నలు (68 questions).. ఈ రోజు 42 ప్రశ్నలు (42 questions) వేశారని పేర్కొన్నారు.
jayamangala venkata ramana:ఏలూరు జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ (jayamangala venkata ramana) వైసీపీలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో (karumuri nageshwar rao) కలిసి ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్‌కు (jagan) శాలువా కప్పి సన్మానించారు. తర్వాత పుష్పగుచ్ఛం అందించారు.
nara lokesh:సీఎం జగన్‌పై (cm jagan) టీడీపీ యువనేత నారా లోకేశ్ ఫైరయ్యారు. చిన్నారి మృతదేహాన్ని 120 కిలోమీటర్లు (120 km) బైక్ మీద పేరంట్స్ తరలించారు. ఈ ఘటన వీడియోను లోకేశ్ (lokesh) ట్వీట్ చేశారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రోమ్ చక్రవర్తి నీరో మీకంటే బెటర్ అంటూ మండిపడ్డారు. పబ్జీ ప్లేయర్ గారూ! అంటూ ట్వీట్లు వేశారు.
లోకేశ్‌కు చీర (saree), గాజులు (bangle) పంపిస్తానని రోజా అన్న సంగతి తెలిసిందే. పంపివ్వండి.. తన అక్క చెల్లెళ్లకు ఇస్తానని లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న ( బుధవారం ) రోజా ఇంటికి వెళ్లేందుకు టీడీపీ మహిళల నాయకులు చీర, సారె తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు ముందే పోలీసులు వారిని నిలువరించారు. ఈ రోజు ఏ కలర్ చీర తీసుకొని రావాలో చెప్పండి అని రోజా అన్నారు.
police remove banners:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రపై పోలీసులు (police) ఉక్కుపాదం మోపుతున్నారు. లోకేశ్ (police) అనుచరులను కూడా వదలడం లేదు. సత్యవేడు (satyavedu) నియోజకవర్గంలో పోలీసులు అతి చేశారు. లోకేశ్ (lokesh) వెళుతున్న దారిలో పార్టీ శ్రేణులు కట్టిన జెండాలు, బ్యానర్లను (banners) తొలగించారు. వాటిని పోలీసు వాహనాల్లో (police) తరలిస్తున్నారు.
BJP MLC Madhav : రాజకీయంగా ఎదగడం కోసం కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారరని బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణ... బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఆ విషయం గురించి తర్వాత చెబుతానని ఆయన అన్నారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ వీడటంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్స...
GVL Narasimha Rao : కన్నా లక్ష్మీ నారాయణ.. బీజేపీని వీడారు. పార్టీని వీడుతూ వీడుతూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తనకు ఇప్పటికీ మోడీ పై గౌరవం ఉందని చెబుతూనే... సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చేసిన కామెంట్స్ పై తాజాగా జీవీఎల్ నర్సింహారావు స్పందించారు.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిని కీలక పోస్టులో కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.