»Central Government Appointed As Kesineni Nani Disha Committee Chairman
kesineni nani:కేశినేని నానికి కీలక బాధ్యతలు.. DISHA కమిటీ ఛైర్మన్గా నియామకం
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిని కీలక పోస్టులో కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది.
kesineni nani:విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిని (kesineni nani) కేంద్ర ప్రభుత్వం కీలక పోస్టులో నియమించింది. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జిల్లాలో కేంద్ర పథకాలకు కీలకం కానున్నారు. జాతీయ స్దాయిలో నియామకాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కేశినేని నానికి కూడా సొంత జిల్లాలో కీలక పోస్టు మంజూరు చేసింది. కేశినేని నానికి దక్కిన పోస్టుపై ఇప్పుడు టీడీపీతోపాటు (tdp) మిగతా పార్టీల్లో చర్చ జరుగుతోంది. పలు జిల్లాలకు దిశా కమిటీలను కేంద్రం ప్రకటించింది. ఇందులో పలువురు ఎంపీలను కమిటీల ఛైర్ పర్సన్లుగా నియమించింది.
దిశా పథకం అసిస్టెంట్ కమిషనర్ ఆయుష్ పూనియా (ayush puniya) ఏపీ పంచాయతీరాజ్ శాఖకు తాజాగా ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో జిల్లా దిశా కమిటీలు సరిగా పనిచేయడం లేదన్నారు. కమిటీలకు స్ధానిక ఎంపీలను ఛైర్ పర్సన్లుగా నియమిస్తే బాగుంటుందని భావించి నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ చేసే కమిటీలకు ఎంపీలు ఛైర్ పర్సన్లుగా పనిచేస్తారని అన్నారు. చైర్ పర్సన్లకు దిశా కమిటీల్లో నాన్-అఫీషియల్ సభ్యులను నామినేట్ చేసే అధికారం కల్పిస్తున్నారని తెలిపారు. 3 నెలలకోసారి (3 months) జిల్లా దిశా కమిటీ సమావేశాలను నిర్వహించాలని, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వెబ్ సైట్లో ఆ వివరాలు అప్ లోడ్ చేయాలని కోరారు. దిశా కమిటీ నియామకం పూర్తి కాకపోయినా సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు.
గత కొంతకాలంగా కేశినేని నాని చంద్రబాబుకు (chandrababu) దూరంగా ఉంటున్నారు. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. రెండుసార్లు ఎంపీగా (mp) గెలిచిన ఆయన.. మూడోసారి టికెట్ ఆశిస్తున్నారు. విజయవాడ (vijayawada) నియోజకవర్గంలో ఆయన తమ్ముడు కేశినేని చిన్ని.. ఇతరులు తిరుగుతున్నారు. దీంతో నాని గుస్సా అయ్యారు. తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే అంటూ రెచ్చిపోయారు. ఇటు వైసీపీతో (ycp) కూడా అంత సఖ్యంగా లేరు. ఇంతలో బీజేపీ (bjp) ఆయనకు మంచి పదవీ ఆఫర్ చేసింది. దీంతో ఆయన పార్టీ మారతారా అనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై కేశినేని నాని (kesineni nani) నుంచి స్పందన మాత్రం రాలేదు.