కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తారకరత్న అకాల మరణం నందమూరి కుటుంబంలో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా పలువురు భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న అంత్యక్రియలు నేడు సాయంత్రం (సోమవారం, 20 ఫిబ్రవరి) మహాప్రస్థానంలో జరగనున్నాయి
ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. సీఎం జగన్ పాలనలో విద్యార్థులకు రక్షణ లేదని ఆరోపించారు. ర్యాగింగ్ ను అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జగన్ పాలనలో గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని తెలిపారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కళాశాలలో ఆగడాలు పెరిగిపోతున్నాయని.. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు తారకరత్న మృతి పైన వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇన్నాళ్లు ఆయన మృతిని దాచి పెట్టారు అని సంచలన ఆరోపణ చేశారు.
నందమూరి తారకరత్న చివరి ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత నెల 27వా తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు తారకరత్న. ఆ సమయంలో అస్వస్థత ఏర్పడి హాస్పిటల్ కు తరలించారు. విషమంగా ఉండడంతో అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. అయితే ఆయన చివరి ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. మన...
నటుడు తారకరత్న నటుడిగా అంతగా నిలబడలేక పోయినప్పటికీ ఆయన కొన్ని పాటలు మాత్రం ఎందరినో అలరించాయి. ముఖ్యంగా నెంబర్ వన్ కుర్రాడు సినిమాలోని నువు చూడూ చూడకపో అనే పాట బాగా క్లిక్ అయింది.
తెలంగాణలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి కబ్జా అంశంపై ఏ పార్టీ నేతలు కూడా ప్రశ్నించలేదని..కానీ తాను అడిగినందుకు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరు అని ఈ ఇద్దరు నేతలు చాటారు. రాజకీయపరంగా కొట్లాడాలి కానీ కుటుంబపరంగా కలిసి ఉండాలని.. మిత్రులపరంగా కూడా కలిసి ఉండాలనేది వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ తో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడేవారు. వీరిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేసేవాళ్లు. కానీ రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు.
పరామర్శ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యం, అంత్యక్రియలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. విజయసాయిరెడ్డి తారకరత్న బంధువు. అందుకే దగ్గరుండి తారకరత్న కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
Kanna : ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయానికి నేతలు.. తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ లు మారాలి అనుకునేవారు మారుతున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ కూడా... బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే టీడీపీలో చేరేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు.
Taraka Ratna : తారకరత్న హఠాన్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
ఎద్దుతో పాటు ఆ యువకుడికి పసుపు పెట్టారు. మంగళ స్నానాలు చేయించారు. ఇక పెళ్లికి భజనలు చేశారు. బాజాభజంత్రీలు వాయించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ భోజనాలు వడ్డించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా విషాదంలో మునిగారు. తారకరత్నను పరామర్శించేందుకు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. కాగా తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమ (Tollywood)లోనూ విషాదం అలుముకుంది. సినీ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం(Earthquake) సంభవించింది. ఎన్టీఆర్(NTR) జిల్లా, పల్నాడు(Palnadu) జిల్లాలో భూ ప్రకంపనలు జరిగాయి. భూమి పలుసార్లు కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శనివారం మహాశివరాత్రి(Maha Shivaratri), ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పులకించింది.