• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పల్నాటి తిరుమల ‘నేతి వెంకన్న’ ఉత్సవాలు

PLD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పల్నాటి తిరుమలలో ‘నేతి వెంకన్న’ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారు పైకప్పు లేకుండా ప్రకృతి ఒడిలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలోని నాలుగు శనివారాలతో పాటు ఉగాది వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

February 21, 2026 / 08:41 AM IST

పేకాట స్థావరంపై దాడి.. నలుగురు అరెస్ట్

కృష్ణా: గూడూరు మండలం చిట్టి గూడూరులో పేకాట స్థావరంపై ఎస్సై దివ్య ప్రకాశ్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

February 21, 2026 / 08:36 AM IST

కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎంపిక

W.G: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సుంకర కాశీవిశ్వేశ్వరరావు నియామకమయ్యారు. శుక్రవారం ఆయనకు నియామకపత్రంను జిల్లా నాయకులు అందించారు. బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలను గౌరవిస్తూ తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడు వెంకట సూర్యనారాయణ రాజు నియామక పత్రాన్ని అందజేశారని కాశీ తెలిపారు.

February 21, 2026 / 08:35 AM IST

ఆత్మహత్యకి యత్నించిన వ్యక్తి మృతి

CTR: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కె. శేఖర్ (43) అనే వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య వివరాల మేరకు.. గిరింపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన శేఖర్ శివరాత్రి రోజున మద్యం తాగడంతో అతని భార్యతో వాగ్వాదం జరిగింది. దీంతో శరీరంపై శేఖర్ ఆయిల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

February 21, 2026 / 08:35 AM IST

బాపట్ల తీర అభివృద్ధిపై గోవాలో కలెక్టర్ పర్యటన

BPT: బాపట్ల తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ వినోద్ కుమార్ బృందం శుక్రవారం గోవాలో పర్యటించింది. అక్కడి తీర ప్రాంత నియంత్రణ మండలి (GCZMA) అధికారులతో వ్యర్థాల నిర్వహణపై చర్చించారు. కాండోలిమ్ బీచ్, ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియంలను సందర్శించి పర్యాటక సౌకర్యాలను పరిశీలించారు. బాపట్ల తీర ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.

February 21, 2026 / 08:31 AM IST

గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

NLR: కావలి మండలం బిట్రగుంట – అల్లూరు రోడ్ RSల మధ్య km no 206/c16 – c17 పోస్టుల మధ్య మూడవ లైన్ మధ్యలో గూడ్స్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి (50-55) బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడని మృతుని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

February 21, 2026 / 08:31 AM IST

KDP: అలర్ట్: రైతులకు యూరియా పంపిణీ

KDP: వల్లూరు సొసైటీ బ్యాంకు వద్ద నేడు ఉదయం 9 గంటలకు యూరియా పంపిణీ చేయనున్నట్లు సొసైటీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, జిల్లా జేడి చంద్ర నాయక్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలిపారు. వరి రైతులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన రైతులు తప్పనిసరిగా ఆధార్,పాస్ బుక్కు తీసుకురావాలని సూచించారు.

February 21, 2026 / 08:30 AM IST

‘నెలాఖరులోగా పేర్లు నమోదు చేసుకోవాలి’

KRNL: యూనిక్ ఐడీ పొందేందుకు రైతులు ఈ నెలాఖరులోగా రైతు రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవాలని కోసిగి మండలం ఏవో వరప్రసాద్ ఇవాళ సూచించారు. మండలంలో 11,238 మంది పీఎం కిసాన్ లబ్దిదారులు ఉండగా వారిలో 9,308 మంది లబ్ధిదారులు మాత్రమే నమోదు చేసుకున్నారన్నట్లు తెలిపారు.

February 21, 2026 / 08:30 AM IST

క్లాత్ యూనిట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ విజయవాడలో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లాత్ వేస్టేజ్ బ్యాగ్స్ తయారీ యూనిట్‌‌ను నిన్న సాయంత్రం సందర్శించారు. వ్యర్థ వస్త్రాలతో పర్యావరణ హితమైన బ్యాగుల తయారీ విధానాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమదాలవలసలో ఇలాంటి యూనిట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

February 21, 2026 / 08:28 AM IST

ELR: జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు

ELR: జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆవుపాడుకి చెందిన అచ్యుత దుర్గ సాయి డ్రగ్ లైసెన్స్ కోసం ఈనెల 6న ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కంపా సురేష్‌ను సంప్రదించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మెడికల్ షాప్ అసోసియేషన్ కోశాధికారి తడికమళ్ళ శివరామకృష్ణను కలవాలని చెప్పగా రూ.20,000 ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.

February 21, 2026 / 08:28 AM IST

విజయవాడలో మిస్సయిన బాలురు.. ముంబైలో సేఫ్

NTR: విజయవాడ భవానీపురంలో మిస్సైన ఇద్దరు చిన్నారుల కేసు సుఖాంతమైంది. ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్, ఉమారామ్, ఆచూకీ లభ్యమైంది. విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

February 21, 2026 / 08:28 AM IST

డోన్ పట్టణంలో సీపీఐ నాయకులు నిరసన

NDL: డోన్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఇవాళ సీపీఐ నాయకుడు రంగం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటూ సమాజంలో కుల వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని సిపిఐ నాయకుడు పేర్కొన్నారు.

February 21, 2026 / 08:28 AM IST

ఆశ్రమ పాఠశాలలను సందర్శించిన ఎస్టీ కమీషన్ మెంబర్

PPM: ఏపీ ఎస్టీ కమిషన్‌ మెంబర్‌ మల్లేశ్వరరావు నిన్న కురుపాం మండలం నీలకంఠాపురంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ, బాలుర బాలికల పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ముస్తాబు గదిని పరిశీలించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలని టెన్త్ విద్యార్థులకు సూచించారు. 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ తప్పనిసరిగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

February 21, 2026 / 08:27 AM IST

పాడి రైతులకు పశువుల దానా పంపిణీ

ప్రకాశం: సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామ రైతు సేవా కేంద్రంలో పాడి రైతులకు ఏపీ పశుసంవర్ధక శాఖ ద్వారా 50% సబ్సిడీతో పశువుల దాన అందజేశారు. జరిగిన ఈ కార్యక్రమంలో సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈ దానా వాడకంతో పశువుల్లో పాలశాతం, పాల ఉత్పత్తి పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పులివర్తి లక్ష్మీ నారాయణ, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:26 AM IST

డిగ్రీ పరీక్షల్లో పలువురు డిబార్..!

KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన డిగ్రీ ఒకటో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 30 మంది విద్యార్థులను డిబార్ చేసి నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 10,282 మందికిగాను 9,452 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు.

February 21, 2026 / 08:25 AM IST