Bonda Uma : రాష్ట్రంలో సైకో పాలన.. బొండా ఉమ సెటైర్లు..!
Bonda Uma : రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శల వర్షం కురిపించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. జగన్ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శల వర్షం కురిపించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. జగన్ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, హత్యలు, దాడులు, తప్పుడు కేసులు పెరిగిపోయాయన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల ఇళ్లు, ప్రతిపక్షాల కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓ ఫ్యాక్షనిస్టు సైకో పరిపాలన ఎలా ఉంటుందో జగన్ పాలనలో ప్రజలకు తెలిసిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర పోలీసుల తీరుపైనా బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారని మండిపడ్డారు. ప్రమోషన్ల కోసం కొంతమంది పూర్తిగా వైసీపీ కండువాలేసుకున్నట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఈ క్రమంలోనే జగన్ ఫ్రస్ట్రేషన్‌తో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతుంటే జగన్‌కు జ్వరం వస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్ పర్యటనలకు కావాలనే ఆటంకాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు.