E.G: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ అమలు విధానంలో సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక పాలసీ అమలు కోసం జిల్లాలో 15 ఓపెన్ రిచ్లు, 14 డి-సిల్టేషన్ పాయింట్లు గుర్తించి ఇసుక సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.