తమ పార్టీ సభకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారని.. డ్రోన్ షాట్లు, కెమెరాలతో రికార్డు చేసి పబ్లిసిటీ కోసం ఇరుకైన ప్రాంతంలో సభ పెట్టారని చంద్రబాబు మీద అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం వల్లే తమ సభకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారని ప్రచారం చేసుకునేందుకు బాబు అలా చేశారని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో నిర్వహించిన సభ మీద ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు లేఖ అందజేశారు.
ఈ బహిరంగ సభలో తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. తమ పార్టీని గొప్పగా చూపించుకోవడం కోసం అమాయకుల ప్రాణాలు తీశారంటూ చంద్రబాబు మీద కేసు నమోదైంది. విజయవాడకు చెందిన అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ చేసిన ఫిర్యాదుపై ఎన్ హెచ్ఆర్సీ స్పందించింది. చంద్రబాబు మీద కేసు నమోదు చేసి వివరణ ఇవ్వాలని కోరింది.