»New Rules In The Management Of Chit Funds In Andhra Pradesh
New Rules : ఎలాపడితే అలా చిట్టీలంటే కుదరదు.. రూల్స్ మారాయ్
ఇప్పటి వరకు ఎవరు పడితే వారు లక్షలకు లక్షలు చిట్టీలు వేసి ప్రభుత్వం కళ్లు కప్పేస్తున్నారు. చిట్టీలు కట్టించుకుని బిచానా ఎత్తేయడంతో కట్టిన వాళ్లు లబోదిబో అన్న ఘటనలు కోకొల్లలు. ఇకనుంచి అలాంటి వాటికి తావులేకుండా ఏపీ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి చిట్టీల నిర్వహణ అంతా ఆన్ లైన్ విధానంలోనే జరగాలి. కట్టాలన్నా లేదా తీసుకోవాలన్నా అన్ని లావాదేవీలు ఆన్ లైన్ ద్వారానే జరపాల్సి ఉంటుంది.
New Rules : ఇప్పటి వరకు ఎవరు పడితే వారు లక్షలకు లక్షలు చిట్టీలు వేసి ప్రభుత్వం కళ్లు కప్పేస్తున్నారు. చిట్టీలు కట్టించుకుని బిచానా ఎత్తేయడంతో కట్టిన వాళ్లు లబోదిబో అన్న ఘటనలు కోకొల్లలు. ఇకనుంచి అలాంటి వాటికి తావులేకుండా ఏపీ సర్కార్(AP Sarkar) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి చిట్టీల నిర్వహణ అంతా ఆన్ లైన్(Online) విధానంలోనే జరగాలి. కట్టాలన్నా లేదా తీసుకోవాలన్నా అన్ని లావాదేవీ(Transactions)లు ఆన్ లైన్ ద్వారానే జరపాల్సి ఉంటుంది.. అందులో భాగంగా ఈ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ను మంత్రి ధర్మాన ప్రసాదరావు(Minister Dharmana Prasada Rao) ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు.. ఈ చిట్స్( E chits) అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను రూపొందించింది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.. ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ- చిట్స్ అనే ఎలక్ట్రానిక్ విధానం ప్రారంభిస్తున్నాం.. చందాదారులు అంతా ఈ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
గతంలో జరిగిన మోసాలను ద్రుష్టిలో ఉంచుకుని మరోసారి మోసాలకు తావులేకుండా చూడాలనే ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్లో లావాదేవీలను పరిశీలించి ఆమోదం తెలుపుతారన్నారు. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్లు నిర్వహించాలి.. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని మంత్రి సూచించారు. కొంత కాలంగా కొన్ని ప్రైవేట్ చిట్ సంస్థల్లో సీఐడీ సోదాలు కలకలం రేపాయి.. ఈ కేసులో కొందరిని సీఐడీ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే.