Mota Mogiddam: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు (chandrababu) అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. మరోసారి జ్యుడిషీయల్ కస్టడీ విధించడంతో అక్కడే ఉండాల్సి వస్తోంది. బాబును బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీ, నారా లోకేశ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటు నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. రేపు వినూత్న కార్యక్రమానికి లోకేశ్ పిలుపునిచ్చారు.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ శనివారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 7.05 నిమిషాల వరకు మోత మోగించాలని నారా లోకేశ్ కోరారు. ఆ మోత సీఎం జగన్‌కు వినిపించేలా ఉండాలన్నారు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనని పోస్టర్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 5 కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటిగా ఇంట్లో లేదంటే ఆఫీసు, ఇతర చోట ఉంటే బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని కోరారు. ఒకవేళ రోడ్డుపై వాహనంతో ఉంటే పక్కకు ఆపి హారన్ మోగించాలని కోరారు. నిరసనకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ… pic.twitter.com/K0J6bo5RBY
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు ప్రజాగ్రహం ఎలా ఉందో చూపిద్దాం.. తప్పుడు కేసులు బనాయిస్తే.. వెనక్కి తగ్గమని నిరూపిద్దాం అని లోకేశ్ కోరారు. ఇదే అంశంపై నారా భువనేశ్వరి కూడా ట్వీట్ చేశారు. చంద్రబాబు మీద తప్పుడు కేసు పెట్టి, అవినీతి చేశారని చెబితే జనం నమ్మరని తెలిపారు. నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలని కోరారు. శబ్దం చేసి.. చంద్రబాబు పట్ల చేసింది తప్పు అని వారికి చెప్పాలని అడిగారు.