Raghurama krishnam raju: జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది..
జగన్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లిందంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ఒక వైపు జగన్.. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని.. తాను కూడా విశాఖ కు మారిపోతానని ప్రకటించారు.
జగన్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లిందంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ఒక వైపు జగన్.. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని.. తాను కూడా విశాఖ కు మారిపోతానని ప్రకటించారు. అయితే.. కేంద్రం షాకిచ్చింది. అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పింది.
కాగా.. కేంద్రం ఒక్క మాటతో జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విశాఖ కు వెళ్తే వెళ్లొచ్చన్నారు. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే అంటూ వ్యాఖ్యలు చేశారు.
నిన్న పార్లమెంట్ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని తెలిపారు. రాజధాని అధికారం రాష్ట్రాలదని అడిగారన్నారు. అమరావతిని కేంద్రం రాజధానిగా అంగీకరించి 2500 కోట్లు గ్రాంట్ ఇచ్చిందని గుర్తుచేశారు. రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్‌కు నిధులు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటే హైకోర్టు కేసును కొట్టేసిందని తెలిపారు. ప్రశ్న అడిగిన సాయిరెడ్డికి ఎంపీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరిగిందని.. మళ్ళీ రాజధాని చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలన్నారు.