mlc election counting:ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
mlc election counting:మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (teacher mlc) ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు జరగనుంది. ఏపీలో కూడా 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.
mlc election counting:మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (teacher mlc) ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు జరగనుంది. ఏపీలో కూడా 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. సరూర్‌నగర్ (saroornagar) ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆల ఆధ్వర్యంలో సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఎన్నికల్లో మొత్తం 29,720 ఓట్లకుగాను 25,866 (87.03 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల చొప్పున లెక్కింపు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 26 టేబుళ్లపై లెక్కింపు జరగనుంది. ఏడు టేబుళ్లకు ఒకరు చొప్పున ఇన్చార్జీలను నియమించారు. లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు.
ఈ సారి 21 మంది (21 candidates) అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన కాటేపల్లి జనార్ధన్ రెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. ఈయన పీఆర్టీయూ మద్దతు ఉంది. పీఆర్టీయూటీఎస్ చెన్న కేశవరెడ్డిని బరిలోకి దింపింది. యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్ రెడ్డి పోటీకి దిగారు. బీజేపీకి అనుకూల సంఘాలు ఏవీఎన్ రెడ్డిని బలపరిచాయి. ఇలా 21 మంది పోటీలో ఉన్నారు. మధ్యాహ్నాం వరకు ఫలితం తేలనుంది. ఇటు ఏపీలో 9 ఎమ్మెల్సీ ఎన్నికలు ఖాళీగా ఉన్నాయి. 3 గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉండగా.. 2 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 7 చోట్ల రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు.