»Minister Dharmana Prasada Rao Said We Will Do Justice To The Farmers Of 15 21 Lakh Assigned Lands
Dharmana prasada rao: 15.21 లక్షల అసైన్డ్ భూముల రైతులకు న్యాయం చేస్తాం
గత 20 ఏళ్లుగా అసైన్డ్ భూములు కబ్జాలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు(minister dharmana prasada rao) అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 15.21 లక్షల మంది రైతులకు యాజమాన్య హక్కులను కల్పించనున్నట్లు తెలిపారు
గత 20 ఏళ్లుగా అసైన్డ్ భూములు కబ్జాలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు(minister dharmana prasada rao) పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 15.21 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు. గతంలో 33,29,000 ఎకరాల అసైన్డ్ భూమిని పంపిణీ చేశామని, స్వాతంత్య్రానంతరం 19,21,000 మంది రైతులకు అసైన్డ్ భూమిని పంపిణీ చేశామన్నారు. వీరిలో ప్రస్తుతం 15,21000 మంది రైతులు ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.
మంత్రి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అసైన్డ్ భూ యజమానులకు(assigned lands) యాజమాన్య హక్కులు కల్పించిందన్నారు. ఈ చర్యతో జీడీపీ 2 శాతం వృద్ధికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. అసైన్డ్ భూములను ఎవరైనా కొనుగోలు చేసినా లేదా బలవంతంగా స్వాధీనం చేసుకున్నా అనుమతించబోమని స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రజలు అలాంటి సంఘటనలను రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.
భూముల రీసర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములపై అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ధర్మాన అన్నారు. రీసర్వే ఫలితంగా అనేక భూ వ్యాజ్యాలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. భూముల రీసర్వే చేపట్టిన తర్వాత 19 లక్షల మ్యుటేషన్లు జరిగాయన్నారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం(ap governament) 22-ఎ జాబితా నుంచి 2.2 లక్షల చుక్కల భూములను తొలగించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 33,428 ఎకరాల చుక్కల భూములకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9,600 ఎకరాల ఐలాండ్ భూములను స్థిరీకరించి పట్టాలు పంపిణీ చేసిందని రెవెన్యూ మంత్రి తెలిపారు.