»Maala Mahanadu Serious On Ycp Leader Borugadda Anil
maala mahanadu serious on anil:బోరుగడ్డ అనిల్‌పై మాల మహానాడు సీరియస్
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌పై (borugadda anil) మాల మహానాడు (maala mahanadu) జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ (golla arun) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత సంఘం పేరుతో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న అనిల్‌పై ఈ రోజు ఉదయం గుంటూరు ఎస్పీకి (guntur sp) ఫిర్యాదు చేశారు.
maala mahanadu serious on borugadda anil:వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌పై (borugadda anil) మాల మహానాడు (maala mahanadu) జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ (golla arun) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత సంఘం పేరుతో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న అనిల్‌పై ఈ రోజు ఉదయం గుంటూరు ఎస్పీకి (guntur sp) ఫిర్యాదు చేశారు. అనిల్ ఓ చీటర్, 420, రౌడీ షీటర్ అని అరుణ్ అన్నారు. టీడీపీ నేత నక్కా ఆనంద బాబు (nakka anand babu), తన నుంచి ప్రాణ హానీ ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అనిల్‌పై 12 కేసులు (12 cases) ఉన్నాయని తెలిపారు. ఆయనో సన్నాసి అని ధ్వజమెత్తారు.
ఏ రోజైనా దళితుల కోసం ఉద్యమాలు చేశావా అని అనిల్‌ను (anil) అరుణ్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు (chandra babu naidu), పవన్ కల్యాణ్ (pawan kalyan), మహిళలపై (womans) తప్పుగా మాట్లాడారని చెప్పారు. జడ్జీలపై (judge) కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించారు. తనకు తాడేపల్లి పెద్దల సపోర్ట్ ఉందని అనిల్ అంటున్నారని.. వారు బయటకు రావాలని గోళ్ల అరుణ్ (golla arun) డిమాండ్ చేశారు. వైసీపీకి (ycp) బోరుగడ్డ అనిల్ మధ్య సంబంధం ఏంటో చెప్పాలని కోరారు. ఇలాంటి వారిపై గతంలో కఠిన చర్యలు తీసుకున్నారని అరుణ్ గుర్తుచేశారు. నగర బహిష్కరణ చేశారని.. అనిల్‌పై పీడీ యాక్ట్ (PD act) నమోదు చేయాలని ఎస్పీని (sp) డిమాండ్ చేశారు.చర్యలు తీసుకోకుంటే.. అనిల్ ఇంటి వద్ద దళిత సంఘాలు దీక్ష చేస్తాయని అరుణ్ తేల్చిచెప్పారు.
బోరుగడ్డ అనిల్ ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై (kotamreddy sridhar reddy) కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌పై (jagan) కోటంరెడ్డి కామెంట్స్ చేయడంతో రియాక్ట్ అయ్యారు. నెల్లూరు నడిరోడ్డు మీద ఈడ్చుకెళ్లి తీసుకెళతానని అన్నారు. ఆడియోను (audio) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తనకు ఎవరు ఫోన్ చేసినా లిప్ట్ చేస్తానని వివరించారు. అలా అనిల్ చేశారని.. అయినప్పటికీ తాను ఏమీ అనలేదని తెలిపారు. తనది ఐ ఫోన్ (I phone) కావడంతో రికార్డింగ్ కాదని.. వారే రికార్డ్ చేసి పోస్ట్ చేశారని తెలిపారు. అనిల్ చేత మాట్లాడించింది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy) అని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. సజ్జలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని (kakani govardhan reddy) కూడా ఏకీపారేశారు.