టీడీపీ యువనేత నారాలోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. కాగా...ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీడీపీ యువనేత నారాలోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. కాగా…ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
జగన్ పాలనలో అందరూ బాధితులేనని దుయ్యబట్టారు. జగన్ పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న అసాధారణ పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పెన్షన్లు జగన్ ప్రభుత్వం కట్ చేసిందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆఖరికి చెత్త పన్ను కూడా పెన్షన్ లో కట్ చేసే దారుణమైన ప్రభుత్వం జగన్ ది అంటూ విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామన్నారు. అలాగే అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చి తీరుతామని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ దెబ్బకి రాష్ట్రంలో కంపెనీలు అన్నీ బై బై ఏపీ అంటున్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు