Vizag: మద్యం లోడ్‌తో ఉన్న ఓ లారీ విశాఖపట్టణంలో (Vizag) బోల్తా పడింది. ఆనందపురం నుంచి విశాఖ వైపు వస్తోండగా.. మధురవాడ పడిపోయింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో లారీ డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంతో లారీలో ఉన్న మద్యం సీసాలు రోడ్లుపై పడిపోయాయి.
లారీ పడిపోయిన వెంటనే అక్కడికి స్థానికులు చేరుకున్నారు. మద్యం సీసాలను చూసి తీసుకునేందుకు ఎగబడ్డారు. ఎవరికి వచ్చిన బాటిళ్లను వారు తీసుకెళ్లారు. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న జనాన్ని చెదరగొట్టారు. లారీ బోల్తా పడిందని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. లారీని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.