BABU మీరు ఢిల్లీ రండి.. మీ సామర్థ్యం తెలుసు, కేవీపీ హాట్ కామెంట్స్
KVP:ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (kvp) హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ (rahul) అనర్హత వేటు గురించి మాట్లాడుతూనే.. చంద్రబాబు (chandrababu) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీ రావాలని.. మీ సామర్థ్యం తనకు తెలుసు అని చెప్పారు.
KVP:ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (kvp) హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ (rahul) అనర్హత వేటు గురించి మాట్లాడుతూనే.. చంద్రబాబు (chandrababu) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవీపీ.. దివంగత వైఎస్ఆర్ (ysr) స్నేహితుడు కాగా.. చంద్రబాబుతోనూ (chandrababu) సన్నిహిత్యం ఉంది. వీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.
రాహుల్ (rahul) అనర్హత గురించి విపక్షాలు అన్నీ కదం తొక్కాయి. కానీ ఏపీలో (ap) టీడీపీ (tdp), వైసీపీ (ycp), జనసేన (janasena) మాత్రం నోరు మెదపడం లేదు. ఇదే అంశాన్ని కేవీపీ రామచంద్రారావు (kvp) ప్రస్తావించారు. మీరెందుకు స్పందించడం లేదని అంటూనే.. మీరు ఢిల్లీలో ఉండాల్సిన నేత.. మకాం మార్చాలని కోరారు. మీ స్థాయి రాష్ట్రం నుంచి దాటిందని చెప్పారు. ఇండైరెక్టుగా రాష్ట్ర బాధ్యతలను మరొకరికి అప్పగించాలని సూచించారు.
1984లో నాదెండ్ల భాస్కరరావు (nadendla bhaskar rao) సంక్షోభ సమయంలో చంద్రబాబు (chandrababu) చేసిన పోరాటాన్ని మరచిపోలేరని కేవీపీ గుర్తుచేశారు. 2018లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్ గాంధీ (rahul gandhi) సంఘీభావం తెలిపారని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడినంత మాత్రానా తక్కువ చూడొద్దని కాంగ్రెస్ నేతలకు కేవీపీ సూచించారు.
చంద్రబాబు (chandrababu) సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని కేవీపీ (kvp) తెలిపారు. హస్తిన రావాలని.. వచ్చి పోరాడాలని సూచించారు. కేవీపీ వైఎస్ఆర్కు (ysr) అత్యంత సన్నిహితుడు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్కు (jagan) దూరంగా ఉంటున్నారు. జగన్ను కాదని కేవీపీ చంద్రబాబును పొగడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ ఇష్యూను ప్రస్తావిస్తూనే.. మకాం మార్చాలని కోరడం వెనక ఆంతర్యం ఏంటి అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు దారితీసింది.