TG: HYD HMDA పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కోకాపేట నియోపోలీస్లోని సర్వే నంబర్ 239, 240లో 16 నుంచి 19 ప్లాట్లు కలిపి మొత్తం 27 ఎకరాలను వేలానికి పెట్టింది. ఎకరా కనీస ధర ప్రభుత్వం రూ.99కోట్లుగా నిర్ణయించింది. అయితే వేలంలో రూ.150 కోట్లు పలుకుతుందని అంచనా.