»Kotamreddy Brother Giridhar Reddy To Join Tdp Today
Kotamreddy to join TDP: నేడు టీడీపీలోకి కోటంరెడ్డి సోదరుడు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA), వైసీపీ రెబెల్ నేత (YCP rebel leader) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సోదరుడు... గిరిధర్ రెడ్డి (Kotamreddy Giridhar Reddy) శుక్రవారం తెలుగు దేశం పార్టీ (Telugu Desam) తీర్థం పుచ్చుకోనున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA), వైసీపీ రెబెల్ నేత (YCP rebel leader) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సోదరుడు… గిరిధర్ రెడ్డి (Kotamreddy Giridhar Reddy) శుక్రవారం తెలుగు దేశం పార్టీ (Telugu Desam) తీర్థం పుచ్చుకోనున్నారు. తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చేరిక నేపథ్యంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు చెందిన ఫ్లెక్సీలను నగరమంతా ఏర్పాటు చేశారు. ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నర్వహించి, ఆ తర్వాత తాడేపల్లి వెళ్లి, సైకిల్ గుర్తు ఎక్కనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గిరిధర్ రెడ్డితో పాటు పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. శ్రీధర్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలంగా ఆయన పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోదరుడు గిరిధర్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరడం ఆసక్తిగా మారింది.
గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచిన తర్వాత గిరిధర్ రెడ్డి నెల్లూరులోని వారి కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు. శ్రీధర్ రెడ్డి ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తానని చెప్పారు. దీంతో ఆయన పంచుమర్తికి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా టీడీపీ గెలుపుతో ఆయన సోదరుడు సంబరాలు జరిపారు. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి టీడీపీలో చేరడం, సంబరాలు చేయడానికి దూరంగా ఉన్నారని అంటున్నారు.
టీడీపీలో చేరికపై వరుస భేటీలు
గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరడానికి ముందు రూరల్ నియోజకవర్గంలోని తన అనుచరులు, అభిమానులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఐదు రోజుల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో డివిజన్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి, ఈనెల 24వ తేదీన తెలుగు దేశం పార్టీలో చేరికపై నేతలతో చర్చించారు గిరిధర్ రెడ్డి. ఆయన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జిగా ఉన్నారు. మరుసటి రోజు వివిధ డివిజన్ ల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. టీడీపీలో చేరికపై అందరి అభిప్రాయం తీసుకున్నారు.