Kodali nani:టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై (nara lokesh) మాజీమంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్రలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ పులిబిడ్డ వైఎస్ జగన్ అని స్పష్టంచేశారు. ఆయన పుట్టి, పెరిగింది కడప జిల్లాలో అని తెలిపారు. నీ లాగా హైదరాబాద్‌లో (hyderabad) కాదన్నారు.
Kodali nani:టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై (nara lokesh) మాజీమంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్రలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ పులిబిడ్డ వైఎస్ జగన్ అని స్పష్టంచేశారు. ఆయన పుట్టి, పెరిగింది కడప జిల్లాలో అని తెలిపారు. నీ లాగా హైదరాబాద్‌లో (hyderabad) కాదన్నారు. లోకేశ్ (lokesh) పుట్టి, పెరిగింది తెలంగాణలో అని ప్రస్తావించారు. విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగిందన్నారు. మొన్న పాదయాత్రకు (padayatra) బయలుదేరే ముందు కూడా కాళ్లకు నమస్కారం చేసి వచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో గల ఇంటిలో చంద్రబాబు, భువనేశ్వరి కాళ్లకు నమస్కారం చేసి వచ్చారని తెలిపారు.
చంద్రబాబు (chandrababu) లాగానే లోకేశ్‌కు (lokesh) అన్నీ అనుమానాలేనని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ఆయన పుట్టి, పెరిగింది తెలంగాణలో కాబట్టి.. జగన్ (jagan) గురించి అనుమానం వచ్చిందని తెలిపారు. ఇక లోకేశ్ (lokesh) మంగళగిరి (mangalagiri) కాకుండా మరో గిరి చూసుకోవాలని నాని (nani) సెటైర్లు వేశారు. తెలంగాణ పుట్టి పెరిగి.. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి తెలియని బచ్చా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. లోకేశ్ బపూన్ అని కమెడీయన్ అంటూ ఫైరయ్యారు. చంద్రబాబు తన కుమారుడి యాత్రకు స్పందన రావడం లేదని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పర్యటించారని తెలిపారు. అందుకోసమే జగన్‌ను (jagan) వ్యక్తిగతంగా దూషించారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు ఫేడవుట్ క్యాండెట్ అని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలే సన్యాసం ఇచ్చారని వివరించారు. జనం కోసం యాత్ర చేపట్టేందుకు వచ్చిన లోకేశ్‌ను జనం పట్టించుకోవడం లేదు. అందుకే హుటహుటిన.. పెద్దాపురం వచ్చాడని తెలిపారు.
ఎన్టీఆర్ (ntr) పార్టీ పెట్టిన సమయంలో చంద్రబాబు (chandrababu) లేరని కొడాలి నాని అన్నారు. ఓడిపోయిన తర్వాత వచ్చి చేరాడని తెలిపారు. పదవీ కోసం వెన్నుపోటు పొడిచాడని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ (pawan kalyan) మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్ చేస్తోన్న నేతలు.. ఎన్టీఆర్ రెండో పెళ్లిపై ఆనాడు ఎందుకు రచ్చ చేశారని అడిగారు. దీనికి బాలయ్య (bala krishna) కూడా సమాధానం చెప్పాలని కొడాలి నాని అడిగారు. ఎన్టీఆర్ కుమారులను చెట్టుకోకరు.. పుట్టకోకరిని చేసి.. పార్టీ దొంగిలించారని హాట్ కామెంట్స్ చేశారు. జగన్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే.. చూస్తూ ఊరుకో బోం అని తేల్చిచెప్పారు.