Kodali nani:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై (chandrababu) మాజీమంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి గుడివాడకు (gudiwada) ఏమీ చేయలేదని విమర్శించారు. పేదల ఇళ్ల కోసం ఇక్కడ ఎకరా భూమి కొనుగోలు చేసినట్టే నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ (ysr), సీఎం జగన్ (jagan) హయాంలో గుడివాడ (gudiwada) నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని వివరించారు. ఇద్దరు నేతలు పేదల ఇళ్ల కోసం 400 ఎకరాల భూమి (400 acres) కొనుగోలు చేశారని తెలిపారు. ఆ భూమిలో 23 వేల మందికి (23 thousand) పట్టాలు అందించామని కొడాలి నాని (kodali nani) గుర్తుచేశారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రూ.320 కోట్లతో ఫ్లై ఓవర్లు నిర్మించామని తెలిపారు.
ఎన్టీఆర్ (ntr) శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు నిన్న చంద్రబాబు (chandrababu) నిమ్మకూరు వచ్చారు. అక్కడ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి.. నివాళులర్పించారు. తర్వాత నిమ్మకూరు గ్రామస్తులకు బట్టలు పెట్టారు. ఇంటి అల్లుడు చంద్రబాబుకు నందమూరి రామకృష్ణ బట్టలు పెట్టారు. చంద్రబాబు (chandrababu) పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది.
ప్రస్తుతం నాని (nani) వైసీపీలో ఉన్న.. అంతకుముందు టీడీపీలో (tdp) ఉన్నారు. చంద్రబాబు (chandrababu) నేతృత్వంలో పనిచేశారు. నాని స్నేహితుడు వంశీ (vamsi) కూడా టీడీపీలో ఉన్నారు. ఇప్పటికీ గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి మరో స్నేహితుడు వంగవీటి రాధా అనే సంగతి తెలిసిందే.