»Janasena Youtube Channel Made History Pawan Kalyan Tweet
Janasena: చరిత్ర సృష్టించిన జనసేన యూట్యూబ్ ఛానల్.. పవన్ ట్వీట్
జనసేన పార్టీకి చెందిన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ కొత్త చరిత్రను సృష్టించింది. ఈ చానెల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య పది లక్షలు దాటింది. ఈ ఆనందకర విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.
Janasena: సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ కొత్త చరిత్రను సృష్టించింది. ఈ చానెల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య పది లక్షలు దాటింది. ఈ ఆనందకర విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. పది లక్షల మంది సబ్ స్క్రైబర్లు చేరుకున్న జనసేన అధికారిక యూట్యూబ్ చానెల్ అని ట్విట్టర్లో పేర్కొంది. ఇక ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తమ పార్టీకి మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర మంగళవారం భీమవరంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఆయన నేడు విశ్రాంతి తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఉదయం నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో జరగాల్సిన సమావేశం వాయిదా వేశారు. సమావేశంలో నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు.
My Heartfelt Congratulations to @JanaSenaParty for reaching the one million subscribers. Thank you all the supporters of JanaSena.🙏🏻 pic.twitter.com/EKojMcGO1X
కాగా, నరసాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ మరోమారు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ హోదాలో బటన్ నొక్కని జాబితాను చదివి వినిపించారు. పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ బటన్, ప్రకటనలే లేని ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్, నష్టపోయిన రైతు పరిహారం బటన్, ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్, మద్దతు ధర రాని కొబ్బరి సాగు బటన్, దగ్ధమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథం బటన్, పూర్తి కానీ బ్రిడ్జి బటన్, దళితులను చంపి బయట తిరుగుతున్న ఎమ్మెల్సీ బటన్, ఆక్వా రైతుకు రూ.1.5కు యూనిట్ విద్యుత్ ఇవ్వని బటన్, కోనసీమ రాని రైలు బటన్ ఇలా గత ఎన్నికల్లో ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చని హామీలను చదివి వినిపించారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఒక్క ఛాన్స్ జనసేన కు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.