Janasena president Pawan Kalyan made key comments in Mangalagiri meeting
Pawan Kalyan: వైసీపీ (YCP)కి ఓట్లేసి గెలిపించుకున్నందుకు ప్రజలు నేడు పశ్చాత్తాప పడుతున్నారని జనసేన అధ్యక్షుడు(Janasena president) పవన్‌కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. తండ్రి లేని పిల్లాడని జాలిపడి గతంలో ఓట్లేశారనన్నారు. మంగళగిరి( Mangalagiri)లోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)తో కలిసి తెనాలి నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తుని వదిలేసి నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుపడాలి అనేది జగన్(Ys Jagan)కు పుట్టుకతో వచ్చిన బుద్ధి అనే విషయాన్ని ఎప్పుడో గ్రహించాను కాబట్టే ఫస్ట్ నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నా అని చెప్పారు. ఆ ప్రభుత్వం చెత్తపైనా, ఇంటిపైన ఇష్టానుసారంగా పన్నులు వేస్తూ, ఆ డబ్బుతో సంక్షేమం చేయడం ఎలా సాధ్యమని పవన్‌కల్యాణ్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది. అక్కడ సీటు, గెలుపూ మనదే. నాదెండ్ల మనోహర్‌ను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అని జనసేన అధ్యక్షుడు పవన్ తెలిపారు. తెనాలి నుంచి గెలిపిస్తే నియోజకవర్గంలో అద్భుతమైన పనులు ఎలా చేస్తామో ప్రజలకు తెలియజేద్దాం. అన్ని వర్గాల ప్రజలు జనసేన వైపు చూస్తున్నందున కలిసి పనిచేసి విజయాన్ని అందుకుందామని పీఏసీసీ ఛైర్మన్ మనోహర్ పిలుపునిచ్చారు.
ఇక హైదరాబాద్(Hyderabad)లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చారు. కంప్యూటర్లు, దస్త్రాలు అన్ని అక్కడికే తరలించారు. పవన్‌కల్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉంటారని, కేంద్ర కార్యాలయంలో పవన్ అవసరాల మేరకు ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇకపై షూటింగ్‌లు ఉంటేనే పవన్ హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.