తన మీద చెయ్యి పడినా, రాయి పడినా ఊరుకోనని, తన్ని తగలేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వార్నింగ్ ఇచ్చారు. మలికిపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రక్షణ చట్టాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఆడపిల్లల జోలికొస్తే కాళ్లుకీళ్లు విరగొట్టే బలమైన చట్టాలను తీసుకురానున్నట్లు తెలిపారు. తనకు రక్షణగా వారాహి(Varahi), జనసైనికులు, వీరమహిళలు ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ(YCP) క్రిమినల్స్ పిండిపిండి చేస్తున్నారని ఆరోపించారు.
రాజోలు సభా వేధికగా పవన్(Pawan Kalyan) మాట్లాడుతూ..తమ ప్రభుత్వం వచ్చిన రోజున ఇళ్లల్లోంచి లాక్కొచ్చి మరీ కొడతామని, బ్లేడ్ బ్యాచ్, బాంబుల బ్యాచ్‌కు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ద్వారంపూడి అనే వ్యక్తి ఉమ్మడి గోదావరి జిల్లాలను శాసిస్తున్నాడని, వ్యాపార రాజకీయాలే కాకుండా వాటికి తోడు క్రైమ్ కూడా రాజ్యమేలుతోందన్నారు.
రాజోలులో గంజాయి దందా విచ్చలవిడిగా సాగుతోందన్నారు. అంతర్వేది రథం కాలిపోతే వైసీపీ(YCP) సర్కార్ పట్టించుకోలేదన్నారు. రాముని విగ్రహం తల నరికేసినప్పుడు తాను నిరసన తెలిపానని, అప్పుడు ముస్లిం సోదరులు తనకు మద్దతుగా నిలిచినట్లు తెలిపారు. ఉర్దూ భాషను మాతృభాషగా తీసుకొచ్చేందుకు జనసేన కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్టు అవకతవకలపై విచారణ జరిపిస్తామని, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని పవన్(Pawan Kalyan) వార్నింగ్ ఇచ్చారు.