ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్(Political Heat) ఎక్కువవుతోంది. ఓ వైపు టీడీపీ యువగళం పాదయాత్ర(TDP Yuvagalam Padayatra)లో లోకేష్(Lokesh) బిబీగా ఉన్నారు. పాదయాత్రలో ఆయన ప్రత్యర్థి పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఆనంరాం నారాయణరెడ్డి(AnamRam Narayanareddy) కూడా వైసీపీ(Ycp)పై సవాల్ విసురుతున్నారు. వారిద్దరికీ కౌంటర్ ఇస్తూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్(Mla anilkumar Yadav) ఫైర్ అయ్యారు. దీంతో నెల్లూరు పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్(Mla anilkumar Yadav) మరోసారి ఆనం రాంనారాయణ రెడ్డికి సవాల్ విసిరారు. తనపై పోటీ చేసి గెలవాలని అనిల్ కుమార్ సవాల్ చేశారు. 2024లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని, ఒక వేళ ఓడిపోతే 44 ఏళ్లకే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనిల్ యాదవ్ తెలిపారు. దమ్ముంటే టీడీపీ నుంచి టిక్కెట్ తెచ్చుకోవాలని, నెల్లూరులో ఎక్కడ నుంచైనా పోటీ చేసే సత్తా లేదని విమర్శించారు.
ఆనంరాంనారాయణ రెడ్డి(AnamRam Narayanareddy) బచ్చా గాడి మీద పోటీ చేసి గెలువంటూ అనిల్ కుమార్ యాదవ్(Mla anilkumar Yadav) ఫైర్ అయ్యారు. ఆనం ఎక్కడా పోటీ చేసినా గెలవరని, టీడీపీని కూడా వదిలేస్తారని అన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీలో కలుపు మొక్కలుగా ఉన్న ముగ్గురిని పీకి పారేశారని, వచ్చే ఎన్నికల్లో పది స్థానాల్లోనూ వైసీపీ(Ycp) గెలిచి తీరుతుందని అన్నారు.