MLC votes:మరికొన్ని గంటల్లో తెలంగాణ ఉపాధ్యాయ (telangana teachers), ఆంధ్రప్రదేశ్లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు (7 mlc seats) కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
MLC votes:మరికొన్ని గంటల్లో తెలంగాణ ఉపాధ్యాయ (telangana teachers), ఆంధ్రప్రదేశ్లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు (7 mlc seats) కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అసలు ఎమ్మెల్సీ (mlc) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా చేపడుతారు? మొదట ఏ ఓట్లను లెక్కిస్తారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లు ఉంటాయనే విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం పదండి.
ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత (protection) ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించే సిబ్బంది ఉంటారు. పార్టీలకు చెందిన ఏజెంట్ల (agents) సమక్షంలో బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లను డ్రమ్ములో కుమ్మరించి వాటిని కలిపేస్తారు. ఏ పోలింగ్ స్టేషన్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసే అవకాశం ఉండదు. ఒక అభ్యర్థి గెలువాలంటే చెల్లిన ఓట్లలో సగానికి కన్నా ఒకటి ఎక్కువ ఓటు రావాల్సి ఉంటుంది.
ముందు మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. చెల్లిన ఓట్లలో సగం +1 వస్తే ఆ అభ్యర్ధిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2, 3, 4 ఓట్లు లెక్కించాల్సిన అవసరం ఉండదు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ సగం కన్నా ఒకటి ఎక్కువ రాకుండే అందరి కంటే తక్కువ మొదటి ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తారు. అతని రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలినవారికి లెక్కించి కలుపుతారు. అప్పుడు ఏ అభ్యర్ధికైనా సగం కన్నా 1 ఓటు ఎక్కువ వస్తే అతన్ని విజయం సాధించినట్టు ప్రకటిస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ముగుస్తుంది.
అప్పటికీ సగం కన్నా 1 ఓటు ఎక్కువ రాకుంటే అతని రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలినవారికి ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. అప్పటికీ ఎవరికీ సగం కన్నా 1 ఓటు ఎక్కువగా రాకపోతే ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఇద్దరి మూడవ ప్రాధాన్యత (3) ఓట్లు కూడా లెక్కించి పైవారికి కలుపుతారు. ఇలా సగం కన్నా 1 ఓటు ఎక్కువ వచ్చే వరకు క్రింది నుండి తక్కువ ఓట్లు వచ్చిన వారి 2, 3, 4. ఓట్లు ఇలా ఒక క్రమంలో కలుపుతారు. చివరి వరకు సగం కన్నా 1 ఓటు రాకుంటే ఎలిమినేట్ కానీ చివరి అభ్యర్ధిని (candidate) విజయం సాధించినట్టు ప్రకటిస్తారు.