ఏపీ(AP) ప్రజలకు రాష్ట్ర సర్కార్ శుభవార్త (Good news) చెప్పనుంది. ఇప్పటి వరకూ రేషన్ సరుకుల(Rationgoods)ను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తోన్న సర్కార్ త్వరలోనే మరికొన్ని పదార్థాలను కూడా అందించనుంది.
ఏపీ(AP) ప్రజలకు రాష్ట్ర సర్కార్ శుభవార్త (Good news) చెప్పనుంది. ఇప్పటి వరకూ రేషన్ సరుకుల(Rationgoods)ను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తోన్న సర్కార్ త్వరలోనే మరికొన్ని పదార్థాలను కూడా అందించనుంది. రేషన్ సరుకుల జాబితాలో మరికొన్ని ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. తాజాగా ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Kaarumuri Nageswara rao) వెల్లడించారు. ఈ మధ్యనే ఆయన కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిశారు. ధాన్యం సేకరణ అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన చర్చించారు.
ఏపీ(AP)లోని రేషన్ కార్డుదారు(RationCards)లకు త్వరలోనే రేషన్ పంపిణీలో భాగంగా గోధుమ పిండి (Wheat flour), రాగులు, జొన్నలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Kaarumuri Nageswara rao) తెలిపారు. రైతులకు దళారి వ్యవస్థను దూరం చేయడంతో పాటు సరైన పంట ధర వచ్చేలా తమ ప్రభుత్వం చేసినట్లు మంత్రి తెలిపారు. ఏపీలో రైతుల వద్ద నుంచి నేరుగా పంటను కొనుగోలు చేస్తున్నామని, దానివల్ల రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) వ్యాప్తంగా 22 లక్షల మెట్రిక్ టన్నుల పైన ధాన్యం (Grain) ఎంత వచ్చినా కూడా సేకరిస్తామని మంత్రి తెలిపారు. ఇంటింటికి రేషన్ (Ration) పంపిణీ విషయంలో కమాండ్ కంట్రోల్ రూమును కేంద్ర మంత్రి ప్రశంసించారన్నారు. త్వరలోనే ఏపీ ప్రజలకు రేషన్ సరఫరాలో గోధుమ పిండి (Wheat Flour), రాగులు, జొన్నలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.