»Former Tdp Minister Ayyanna Patrudu Arrested Visakhapatnam Airport
Ayyanna patrudu: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్టు
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇటివల గన్నవరం యువగళం పాదయాత్రలో సీఎం సహా పలువురికి సంచలన వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
former tdp minister ayyanna patrudu arrested visakhapatnam airport
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు(ayyanna patrudu)ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇటివల గన్నవరం యువగళం మీటింగ్లో అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ తోపాటు పలువురు మంత్రులపై తీవ్రమైన పదజాలంతో దూషించారనే ఆరోపణలపై అరెస్టు(arrested) చేసినట్లు తెలుస్తోంది. అసలు ఈ అంశంపై ఎవరు ఫిర్యాదు చేశారు అనే పలు రకాల విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.