VZM: డైరెక్టర్ జనరల్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న రీ నీట్ 2026 ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు DRO సత్తిబాబు తెలిపారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు 7 పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.