W.G: నరసాపురంలో ప్రథమ శ్రేణి గ్రంథాలయాన్ని ఉమ్మడి ప.గో. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యలో నిలిచిపోయిన నూతన భవన నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఆర్డీవో దాసి రాజును కలిసి, గ్రంథాలయ నిర్వహణకు తాత్కాలికంగా అద్దె భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.