SKLM: కార్మికులను నిర్బంధించి పని చేయించటం చట్ట రీత్యా నేరమని శ్రీకాకుళం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వై. శైలేశ్ కుమార్ అన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ఎన్జీఓ హోమ్ వద్ద ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులను నిర్ణీత పని గంటల తర్వాత స్వేచ్ఛగా తాము జీవించే హక్కుందని సూచించారు.