CTR: పాలసముద్రం మండలం టీడీపీ అధ్యక్షుడిగా తాలూరు శివను ఎన్నుకున్నారు. ఆదివారం పెనుమూరు మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే థామస్ నూతనంగా ఎన్నికైన శివతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. అవకాశం కల్పించిన ఎమ్మెల్యే థామస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.