ATP: పెనుకొండ పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ రూరల్ మండలంలోని టీడీపీ నాయకులకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.