ELR: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా ఆయన డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖరం వెంట ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఉన్నారు.