ASR: కొయ్యూరు గురుకుల పాఠశాలలో 2025-26 సంవత్సరం 5వ తరగతిలో ప్రవేశానికి 6, 8, 9వ తరగతుల్లో మిగుల సీట్ల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్ మంగళవారం తెలిపారు. 5వ తరగతిలో-60సీట్లు, 6లో-15, 8లో-3, 9వ తరగతిలో-2 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 25నుంచి మార్చి నెల 25వ తేదీలోగా ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.